Suryaa.co.in

Telangana

36 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

-ఎమ్మెస్పీ ధరకే తడిచిన ధాన్యం కొనుగోలు
-వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటా కు 500 బోనస్
-అమ్మ ఆదర్శ కమిటీ ల ద్వారా పాఠశాల మెయింటెనెన్స్
-తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్: 36 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల లోపే రైతు ల ఖాతాలో నగదు జమ చేశాం. ఎమ్మెస్పీ ధరకే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటా కు 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నకిలీ విత్తనాల అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసాం. అమ్మ ఆదర్శ కమిటీ ల ద్వారా పాఠశాల మెయింటెనెన్స్ చేస్తాం. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు, విద్యా వ్యవస్థ లో మార్పులకు శ్రీధర్ బాబు కమిటీ వే శాం.

అన్నారం ,సుంధిళ్ళ ,మెడిగడ్డ బ్యారేజ్ లలో నీటి నిల్వ చేయకూడదని ఎన్డీఎస్ ఎ రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజ్ ల సేఫ్టీ పై ఎక్స్ పర్ట్ కంపెనీలతో పరిశీలన చేయించి రిపోర్ట్ తీసుకుంటాం. ఆ రిపోర్ట్ ఆధారంగానే మరమ్మతులు చేపడుతాం. తక్కువ ఖర్చుతో నీటి ని లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటె పరిశీలించాలని కేబినేట్ నిర్ణయించింది.

జూన్ 2 కు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ సభకు సోనియా గాంధీ తో పాటు తెలంగాణ ఏర్పాటు కు కృషి చేసిన వారిని ఆహ్వానిస్తాం.. వేడుకల నిర్వహణ కు ఈసీ కి లేఖ రాయాలని నిర్ణయించాం.

LEAVE A RESPONSE