Home » జగన్ తాబేదారులుగా ఉన్న అధికారుల్లో ఇకనైనా మార్పు అవసరం

జగన్ తాబేదారులుగా ఉన్న అధికారుల్లో ఇకనైనా మార్పు అవసరం

• జగన్ రెడ్డి పాలన అంతా అరాచకం, కిరాతకం, దారుణం, హింసాత్మకం, రక్తపాతం
• నేనే ప్రభుత్వం.. నేనే రాజును అనేలా జగన్ పాలన
• దాడులు దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని కుట్ర
• టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి దాడి
• పట్ట పగలే టీడీపీ నేతలను చంపేందుకు యత్నించిన వైసీపీ గుండాలు
• పులవర్తి నాని, జేసీ ప్రభాకర్ తో పాటు అనే మంది టీడీపీ నేతలపై దాడులు
• వైసీపీ తాబేదారులుగా ఉన్న పోలీసులు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు
• నిశబ్ధ విప్లవంతో జగన్ పాలనను పాతిపెట్టిన జనం
• జూన్ 4 తరువాత జగన్ పారిపోవడం ఖాయం
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి

జగన్ రెడ్డి పాలన అంతా అరాచకం, కిరాతకం, దారుణం, హింసాత్మకమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ఎన్.బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి విమర్శించారు. నిలం సంజీవరెడ్డి లాంటి ఉత్తమ నేతలు పుట్టిన రాయసీమను రావణ కాష్టం చేశాడని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వారు మాట్లాడారు.

డా. ఎన్.బి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..నేనే ప్రభుత్వం నేనే రాజును అనేలా జగన్ పాలన ఉంది. అధికార దాహంతో దాడులు దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి కుట్ర చేశాడు. టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి దాడి చేశారు. పట్ట పగలే టీడీపీ నేతలను చంపేందుకు యత్నించారు. పులవర్తి నాని, జేసీ ప్రభాకర్ తో పాటు అనేక మంది టీడీపీ నేతలపై దాడులు చేసి రక్తపాతం సృష్టించారు.

టీడీపీ నేతలపై దాడు చేస్తే.. వైసీపీ తాబేదారులు ఉన్న పోలీసులు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. ఎన్నికల రోజు జరిగిన నిశబ్ధ విప్లవంతో జగన్ పాలలను జనం పాతిపెట్టారు. జూన్ 4 తరువాత జగన్ పారిపోవడం ఖాయం. పులవర్తి నానిపై పట్టపగలు కత్తులు, సమ్మెటలతో చంపాలని చూడటం దారుణం. రాయలసీమ చరిత్రలో సమ్మెటతో వ్యక్తిని చంపాలనుకోవడం ఇదే మొదటిసారి. పులవర్తి గన్ మెన్ అలర్ట్ కాకుంటే పులవర్తిని చంపేవారు.

వాళ్లే చంపడానికి వచ్చి మళ్లీ టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. దాడికి సంబంధం లేని వారిపై కేసులు పెట్టారు. జగన్ కనుసన్నల్లో అధికారులు చాలా దారుణాలు చేశారు.. ఇకనైనా మరాలి. పెద్ది రెడ్డి నియోజకవర్గం పుంగనూరులోని బూరగమందలో 8 మంది టీడీపీ ఏజెంట్లను బహిరంగంగా కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు కిడ్నాప్ చేసిన వారిపై కేసులు పెట్టలేదు.

ఎమ్మెల్యే అభ్యర్థి చల్లబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ అరాచకాలపై ముందే ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఇది వరకు చంద్రబాబు అక్కడ పర్యటిస్తే రాళ్లతో కొట్టడమేకాక టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల సంస్కృతిని చిత్తురుకు తీసుకు వచ్చారు. రాష్ట్రాన్ని పులివెందులలా మార్చాలని చూశారు.

తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలపై సినిమా తరహాలో క్రైమ్ త్రిల్లర్ లాంటి దాడులు చేశారు. ఆధారాలు లేకుండా చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి కంప్యూటర్లు పగలకొట్టారు. పోలీసులు బాస్పవాయువు ప్రయోగం చేశారు. ఆ బాస్పవాయువు ప్రయోగంతో ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రి పాలైయ్యారు. డీఎస్సీ చైతన్య పోలీసు అనేది మరిచిపోయి ఒక గుండాలా వైసీపీ తాబేదారుగా ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న వ్యక్తిపై దారుణంగా దాడి చేశాడు.

వైసీపీ మూకల దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై మీడియాపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ఆ వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. ఓడిపోవడం ఖాయమని భావించిన వైసీపీ రౌడీ మూకలు.. చంద్రగిరి, పుంగనూరు, తాడిపత్రి నియోజకవర్గాల్లో టిడిపి కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడ్డాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలే దాడికి పురికొల్పారు. మోహిత్ రెడ్డి టీడీపీ నాయకులపై దాడికి ప్రోత్సహించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడినా చర్యలు లేవు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడిచేసి చితకబాధారు. ఇంట్లోని పనిమనుషుల్ని కూడా ఎత్తుకెళ్లారు. డీఎస్పీ చైతన్య లాంటి పోలీసు అధికారులు ఉన్నంత కాలం ప్రజాస్వామ్యంలో ప్రజలు బతకలేరు అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి.

రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల విధానాన్ని వ్యక్తిగత విధానంగా మార్చిన ఘనత జగన్ రెడ్డిదే. రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకంగా జగన్ రెడ్డి నడుచుకున్నాడు. తానే ప్రభుత్వం, తానే రాజ్యం, తానే రాజు అన్నట్లు కొత్త నిర్వచనం తీసుకు వచ్చి తిరుపతి లాంటి శాంతి ప్రదేశంలో రక్తపాతం సృష్టించాడు ఈ రాక్షస జగన్. ఇటువంటి నీచనమైన పాలనను ప్రజలు ఎప్పుడూ చూడలేదు.

రాయలసీమలో ప్రజలు పత్రిరోజు భయపడుతూ బ్రతుకుతున్నారు. ఈ భయం నుండే ఎన్నికల రోజు నిశబ్ధ విప్లవం పుట్టింది. వైసీపీ అరాచక పాలనను పాతిపెట్టేలా జగన్ ను గద్దె దించేలా ఓట్లు వేశారు. ప్రజాస్వామన్యాన్ని మంటగలిపిన జగన్ రెడ్డిని ప్రజలు ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టారు. జూన్ 4 ఇది స్పష్టం అవుతుంది. జగన్ రెడ్డికి ఇక రాజకీయ సన్యాసం తథ్యం.

Leave a Reply