Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్షనేత పర్యటనను అడ్డుకోవడం అధికార దుర్వినియోగం

-మంత్రి పెద్దిరెడ్డి విపరీత పోకడల్ని డీజీపీ నివారించాలి
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అక్రమ కేసులతో పండుగ పూట పుంగనూరు టీడీపీ నేతల్ని మంత్రి పెద్దిరెడ్డి జైలులో పెట్టించి పెత్త తప్పు చేశారు. పండగపూట జైలులో ఉన్నవారి కుటుంబాల ఉసురు పెద్దిరెడ్డికి తగలకమానదు. బాధితుల పరామార్శకు వెళ్తున ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి బ్యానర్లు కట్టిండం టీడీపీ బ్యానర్లు చించడం మరో తప్పు. ప్రతిపక్ష నేత పర్యటనకు వ్యతిరేకంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి సర్కిల్ ఇన్స్ పెక్టర్ చేత 30 యాక్టు నోటీసు ఇప్పించడం అధికార దుర్వినియోగమే. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పోలీస్ యాక్టు 30 ఉన్నా.. యదేచ్ఛగా కోడి పందేలు, జూదాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ పోలీస్ యాక్టు 30 ఏమైంది? కేవలం ప్రతిపక్షాల్ని ప్రజల వద్దకు, బాధితుల వద్దకు వెళ్లకుండా నిరోధించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే ప్రతిపక్ష నేతను ఎందుకు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు? ప్రజల్ని బయపెట్టి లాండ్, శాండ్, వైన్, మైన్, రెడ్ శాండిల్ కుంభకోణాలు యదేచ్ఛగా చేస్తున్నారు. ఇవి బయటపడతాయనే భయంతోనే ప్రజలపై, ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారు. ఇళ్లను ధ్వంసం చేయిస్తున్నారు. బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారు. పరాకాష్టగా ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకొనే కుట్ర చేస్తున్నారు. డిజిపి జోక్యం చేసుకొని ప్రతిపక్ష నేత పర్యటన సజావుగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలి

LEAVE A RESPONSE