గుంటూరు : భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు జన్మాంతం రుణపడి ఉంటానని శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ బోడేపూడి వెంకట సుబ్బారావు(బీఎస్ఆర్) అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ లో రిటైర్డ్ ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బోడేపూడికి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా బోడేపూడి మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బోల్లేపల్లి సత్యనారాయణ, విద్యా వేత్త గడిపూడి వెంకట రాయుడు, రిటైర్డ్ ఐజీ రవిచంద్ర, రిటైర్డ్ డిఎస్పీలు సుబ్బారెడ్డి, నారాయణ, పోతురాజు, సీనియర్ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, బిల్డర్ నన్నపనేని సుబ్బయ్య, టీడీపీ సీనియర్ నేత చిగురుపాటి నాని పాల్గొన్నారు.