– రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్
విజయవాడ : కందుకూరు నియోజక వర్గం, గుడ్లూరు మండలం, దారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు కుటుంబంపై జరిగిన హత్య కాండను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించడాన్ని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ స్వాగతించారు. బుధవారం విజయవాడ,ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో జనార్దన్ మాట్లాడుతూ లక్ష్మీనాయుడు భార్యకు 2 ఎకరాలు, 5 లక్షల రూపాయలు, వారి కుమార్తెలకు 2 ఎకరాలు, 5లక్షల డిపాజిట్, వారి చదువు ప్రభుత్వమే చేపట్టడం,లక్ష్మి నాయుడు సోదరులు పవన్ కు నాలుగు ఎకరాల భూమి, 5 లక్షల నగదు, గాయపడ్డ భార్గవ్ కు మూడు లక్షల రూపాయల నగదు తో పాటుగా వైద్య ఖర్చు ప్రభుత్వం మే భరిస్తుందని ప్రకటించడం అభినందనీయమన్నారు.
ఈ సమావేశం లో జే ఏ సి నాయకులు కొక్కిరాల సంజీవ కుమార్,భావనారాయణ, కొండేటి రాజేంద్ర, యెన్ ఎస్ యు ఐ రాజు, మాసా బత్తుల శ్రీనువాస్, కేతినీడు భాస్కర్, ఐ లా విజయ్ కుమార్, సుంకర సాంబ శివరావు, జొన్నా రాజేష్, ఎర్రం శెట్టి అంజి బాబు, అల్లం రాజేష్, అడబాల సత్యనారాయణ,పెన్నేరు దామోదర్, పుప్పాల రామారావు, పచ్చి పాల రాజా పాల్గొన్నారు.