* డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి: ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంపై టీడీపీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా ఆస్ట్రేలియా దేశంలో ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం వివిధ భాగస్వామ్య ఒప్పందాలను చేసుకొని విజయవంతంగా తన విదేశ పర్యటనను పూర్తి చేసుకున్నారని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, నగరాల అభివృద్ధికి భాగస్వామ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి, ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. సిడ్నీలో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో లోకేష్ పెట్టుబడిదారులను ఏపీకి ఆహ్వానించారని, ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు అమెరికా ఆంక్షలు నుండి తట్టుకొనేందుకు లోకేష్ కృషి చేయడం అభినందనీయమన్నారు.