10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసింది:కేంద్రం

10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసింది:కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం వెల్లడించింది. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చాయని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ ఈమేరకు జవాబిచ్చింది. 2019-21మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్‌బీఐ ₹11,937 కోట్ల రుణాలివ్వగా.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ₹10,865కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹7వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ₹2,970 కోట్లు, కెనరా బ్యాంక్‌ ₹ 4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ₹7,50 కోట్లు, ఇండియన్ బ్యాంక్ ₹ 5,500కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ₹1,750కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ ₹5,633 కోట్లు, యూనియన్ బ్యాంక్‌ ₹6,975 కోట్లు ఇచ్చాయి.