Suryaa.co.in

Telangana

కరెంటు షాక్ తో బాలుడు మృతి

కామారెడ్డి జిల్లా: విద్యుత్ షాక్‌తో ఓ 19 నెలల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతం పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. . భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన రమ్య, భర్త బండి ప్రవీణ్‌తో గొడవపడి ఏడాది కాలంగా పుట్టింది వద్దే ఉంటుంది. సోమవారం రాత్రి తన కొడుకు శ్రీతిక్‌ను ఎత్తుకొని తీగ పై బట్టలు ఆరా వేస్తున్న క్రమంలో సడన్‌గా విద్యుత్ షాక్ తగిలింది.

ఈ విషయాన్ని గమనించిన పక్కింటి వ్యక్తి, అక్కడికి చేరుకొని కట్టె‌తో వైరు‌ పై గట్టిగా కొట్టాడు. దీంతో తల్లీ రమ్య కింద పడిపోయింది. అప్పటికే బాలుడు శ్రీతిక్ నోటి మాట రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే అదే రాత్రి గ్రామ సర్పంచ్ చిట్టెడి మధు మోహన్ రెడ్డి తన వాహనంలో ఎక్కించుకొని కామారెడ్డి‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

LEAVE A RESPONSE