Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణుల శాపంతో ఈ ప్రభుత్వం పతనం

-బ్రాహ్మణ నాయకుల అక్రమ అరెస్ట్ పై మండిపడుతున్న బ్రాహ్మణ సంఘాలు
-తెలుగు దేశం, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ ఆద్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ముట్టడి యత్నం
-భారీగా పోలీసుల మోహరింపుబ్రాహ్మణులను ఈడ్చుకుంటూ అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు
-పోలీసు స్టేషన్ లో బ్రాహ్మణులను పరామర్శించి మద్దతు తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమ టిడిపి నేతలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం కావడం మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తెలుగు దేశం పార్టీ పరిపాలనలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు పునరుద్ధరించి కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి డొక్కా నాగబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామరాజు గడ్డ కుసుమకుమారి, అర్ భి ఎఫ్ జాతీయ కన్వీనర్ తిరుపతి కె పి సి పి సాయి స్వామి, ఆర్ బి ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామరాజు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు దేశం యువ నాయకులు ఆర్ భి ఎఫ్ రాష్ట్ర నాయకులు గండ్లూరు మహేష్ శివశర్మ ప్రవీణ్ అప్పాజీ తెలుగు దేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాణి శ్రీనివాస్ తదితరులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బ్రాహ్మణులు కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి బ్రాహ్మణ నాయకులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ భారీ ఎత్తున విచ్చేశారు బ్రాహ్మణులను కార్పొరేషన్ వద్దకు వెళ్లకుండా గొల్లపూడి సెంటర్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మరో మోహరించి, ఆందోళనకు వెళుతున్న బ్రాహ్మణులను అడ్డుకోవడం తో , పోలీసులకు బ్రాహ్మణులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.

అరెస్ట్ కు తాము అంగీకరించేది తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తామని అర్ భి ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ, తెలుగు దేశం నాయకులు గండ్లూరు మహేష్ శివ శర్మ, కుసుమ కుమారి డొక్కా నాగబాబు తదితరులు అడ్డు పడడంతో పోలీసులు బ్రాహ్మణ నాయకులను ఈడ్చుకోంటు తీసుకెళ్ళి, వాహనాలు ఎక్కించి కొందరిని ఇబ్రహీం పట్నం పోలీసు స్టేషన్ కు, మరికొందరిని భవాని పురం పోలీసు స్టేషన్ కు తరలించారు.

రాష్ట్రీయ బ్రాహ్మణ ప్రింట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామరాజ్ శ్రీనివాస్ ఆధ్వర్యలో బ్రాహ్మణ కార్పొరేషన్ మెయిన్ గేట్ వద్దకు కార్పొరేషన్ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ , రౌడీల రాజ్యం గా మారిందని బ్రాహ్మణులు మండిపడ్డారు. బ్రాహ్మణులకు ఈ ప్రభుత్వం లో రక్షణ కరువైందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి బ్రాహ్మణ సంక్షేమ పథకాలు రద్దు చేసి, ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి వర్గం పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు 2019 ఎన్నికలకు ముందు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి, బ్రాహ్మణులకు అగ్ర పీఠం వేస్తానని మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేసి, మోసపూరితంగా బ్రాహ్మణుల ఓట్లను కొల్లగొట్టి అధికారం లోకి వచ్చిన తర్వాత, బ్రాహ్మణ సమాజాన్ని చిన్నచూపు చూసి బ్రాహ్మణుల సంక్షేమం గాలికి వదిలేసి, నిరుపేద బ్రాహ్మణులకు తీరని అన్యాయం చేసారన్నారు. ఈ సందర్భగా ఆరెస్ట్ అయి పోలీసు స్టేషన్ లో ఉన్న బ్రాహ్మణ నాయకులను రాష్ట్ర మాజీ మంత్రి దేనినేని ఉమ ఇతర తెలుగు దేశం పార్టీ నాయకులు పరామర్శించారు

LEAVE A RESPONSE