బ్రాహ్మణులది తాలిబన్ల సంస్కృతా?

అప్పుడు, ఇప్పుడూ బ్రాహ్మణు లు ఎవరికి సేవలు చేశారంటే..
వశిష్టుడు బ్రాహ్మణుడు…
సేవ చేసింది సూర్యవంశానికి.
చాణక్యుడు బ్రాహ్మణుడు…
పట్టం కట్టింది శూద్రుడైన చంద్రగుప్తునికి.
విద్యారణ్యుడు బ్రాహ్మణుడు..
పట్టం కట్టింది కురుబుడైన హరిహర రాయలు,బుక్కరా యల సోదరులకు.
సమర్థ రామదాసు బ్రాహ్మణుడు..
పట్టం కట్టింది శూద్ర శివాజీకి.
గోవింద దీక్షితులు బ్రాహ్మణుడు..
పట్టం కట్టింది శూద్ర నాయకుడై న జనాంగనికి.
అంతిమంగా- బ్రాహ్మణులు.. అందరినీ కిందకు తొక్కుతారు అని పట్టం కడతారు.
మేము బ్రాహ్మణులమ్
మేము క్షత్రియుడైన శ్రీరాముని
ఆదర్శంగా తీసుకుని పూజిస్తాం.
గొల్ల గోపకుడైన శ్రీకృష్ణుని
పరమాత్ముడు అని ఆరాదిస్తాం.
స్మశానం లో సంచరించే ఈశ్వరుని పరమేశ్వరుడు అని పూజిస్తాం.
బ్రాహ్మణుడైన బ్రహ్మకు
నమస్కారం చేయము.
బ్రహ్మణుడైన రావణుడి..
దుష్టుడు,దుర్మార్గుడు అంటాం.
ఇంతచేసినా కూడా పరుల
కళ్ళకు జాతీయవాదులం
ఎందుకంటే,….
మేము బ్రాహ్మణులం.
ప్రతిభావoతులను ప్రోత్సహిస్తాం.
కళా, సాంసృతులను ఆరాదిస్తాం.
ఎవరైనా ఎదుగుతుంటే వారికి నిచ్చెన వేస్తాం.
ఇంత చేసినా కూడా పరుల కళ్ళకు తాలిబన్ల సంస్కృతి వాళ్ళం.
ఎందుకంటే..
మేము బ్రాహ్మణులం..!!
అన్నం పెట్టకున్నా గంజిని
పెట్టి ఆకలి తీరుస్తాం.
అయినా కూడా పరాయి కళ్ళకు మేము బాధపెట్టె వాళ్ళం..
ఎందుకంటే…
మేము బ్రాహ్మణులం.
గవర్నమెంట్ పథకాలు లేకున్నా
దేవుడు ఇచ్చాడని అనుకుంటాం
రిజర్వేషన్లు లేకున్నా మా
పిల్లలను అప్పుచేసి చదివించి
సర్కారు బళ్లకు,కంపినిలకు
పంపిస్తాం.
మేము దేశానికి సేవకులై,శ్రామి కులమై ఈ మట్టికోసం పోరాడుతాం.
ఎందుకంటే,…
మేము బ్రాహ్మణులo.!!
అందరితోను ఎన్నో తిట్లు,కష్టాలు,కన్నీళ్లు..
అందరితోనూ… “మెప్పు”పొందుతాం.

-సిరపురపు శ్రీధర్‌శర్మ

Leave a Reply