Suryaa.co.in

Crime News Telangana

మహిళా కానిస్టేబుల్ ని నరికి చంపిన తమ్ముడు

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో కుటుంబీకులు ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్లొస్తున్న నాగమణిని రాయపోలు-మన్నెగూడ మార్గంలో పరమేశ్ కారుతో ఢీకొట్టాడు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంపాడు.

LEAVE A RESPONSE