Suryaa.co.in

Telangana

‘బలగం’తో ఒక్కటైన అన్నదమ్ములు

స్థల వివాదం కారణంగా ఎన్నో ఏండ్లుగా గొడవలు పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను బలగం సినిమా ఒక్కటి చేసింది. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో జరిగింది. లక్ష్మణచాంద గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గుర్రం పోసులు, గుర్రం రవి స్థల వివాదం కారణంగా ఏండ్ల తరబడి గొడవలు పడుతున్నారు. కాగా.. లక్ష్మణచాంద గ్రామ సర్పంచ్‌ సూరకంటి ముత్యంరెడ్డి శనివారం గ్రామంలో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన ఆ అన్నదమ్ములు మనసు మార్చుకొని ఆదివారం స్థల వివాదాన్ని పరిష్కరించుకొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

LEAVE A RESPONSE