కైకిలపోయి మిర్చి కోసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

పని చేసినందుకు గాను 200/ రూ,కూలీ

వారమంతా విధి నిర్వహణలో బిజీగా గడిపే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆదివారం సెలవు రోజున కైకిలపోయి మిరుప తోటలో కూలీలతో కలిసి మిర్చి కోశారు. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయితీ పరిధి చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన దేవిరెడ్డి జయలక్ష్మి – వెంకటస్వామిరెడ్డి దంపతుల మిరుప తోటలో కూలీలతో మమేకమై ఉదయం 6గ,ల నుండి మధ్యాహ్నం 1 గ,ల వరకు మిర్చి కోశారు,మహిళలతో కలిసి అన్నం తిన్నారు. పని చేసినందుకు గాను 200/ రూ,కూలీగా తీసుకున్నారు, ఆ డబ్బులను ఓ పేద మహిళ కూలీకి తస్లీమా అందించారు. వ్యవసాయ పనులు చేయడం తనకు ఇష్టమని, రైతుల గడపడం గొప్పవరమని తస్లీమా అన్నారు.యువకులు ఖాళీ సమయాలలో కాలాన్ని వృధా (కాలక్షేపం) చేయకుండా వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు సహకరించాలని తస్లీమా కోరారు.

Leave a Reply