October 3, 2026

బీఆర్ఎస్ కొడంగ‌ల్ లో మీటింగ్ పెట్టుకోవ‌చ్చు

  • త‌ల‌సాని.. మీరంతా వాళ్ల కోస‌మే ప‌నిచేస్తున్నారా?
  • మాక్ అసెంబ్లీలో మాత్రం సీఎం గా త‌ల‌సానిని పెట్టారు
  • యుద్ధంలో వీరుడు ముందుంటాడు
  • కాలం క‌న్న నాయ‌కుడు రేవంత్ రెడ్డి
  • ఇళ్లు లేద‌ని చెప్పిన వారికి 190 గ‌దులున్న ఫైవ్ స్టార్ హోట‌ల్స్ ఎలా వ‌చ్చాయి?
  • క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఆస్తులు మాత్ర‌మే వేల శాతం ఎలా పెరిగాయి?
  • మిగిలిన రాజ‌కీయ పార్టీల నాయ‌కుల ఆస్తులు ఎందుకు పెర‌గ‌లేదు?
  • బీఆర్ఎస్ భూస్థాపితం కావ‌డానికి కేటీఆర్ ఒక్క‌డు చాలు
  • ప్ర‌భుత్వ విప్ అద్దంకి ద‌యాక‌ర్ , బీర్ల అయిల‌య్య‌

హైదరాబాద్‌: ఆస్తుల అంశం ఉంచి త‌ప్పించుకోవ‌డానికి బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి ఆస్తులు ఎలా వ‌చ్చాయ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం లేదు. అసైన్డ్ భూములు, ప్ర‌భుత్వ భూముల‌ను ఎలా తీసుకున్నార‌న్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం లేదు. జ‌న్వాడ ఫామ్ హౌస్ లో కేటీఆర్ భార్య‌, అత్త‌కు భూములున్నాయి. అయినా జ‌న్వాడ ఫామ్ హౌస్ నా ఫ్రెండ్ ది అని కేటీఆర్ చెపుతున్నాడు.

బీఆర్ఎస్ నాయ‌కులు అధికార దుర్వినియోగం చేసి అక్ర‌మ ఆస్తుల‌ను సంపాదించారు. ఉండ‌టానికి ఇళ్లు లేద‌ని చెప్పిన వారికి 190 గ‌దులున్న ఫైవ్ స్టార్ హోట‌ల్స్ ఎలా వ‌చ్చాయి? బ‌త‌కడానికి వ్యాపారాలు చేయోద్దా అని కేటీఆర్ బుకాయిస్తున్నాడు. కేవ‌లం క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఆస్తులు మాత్ర‌మే వేల శాతం ఎలా పెరిగాయి? మిగిలిన రాజ‌కీయ పార్టీల నాయ‌కుల ఆస్తులు ఎందుకు పెర‌గ‌లేదు.. ?

క‌ల్వ‌కుంట్ల కుటుంబం సుద్ద‌పూస‌ల్లా మాట్లాడుతోంది. మీ సుద్దుల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు విన‌రు.న‌మ్మ‌రు. సీఎం రేవంత్ రెడ్డి సంపాదించ‌లేదా అని పిచ్చి మాట‌లు బీఆర్ఎస్ నాయ‌కులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి త‌న ఇర‌వై ఏళ్ల రాజ‌కీయ జీవితంలో 17 ఏళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలోనే ఉన్నారు. ఆయ‌న ఇంట్లో ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు ఆ నాడు సోదాలు చేయ‌లేదా? మీ ఆస్తుల‌ను స్వ‌చ్చందంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం ప్ర‌క‌టించాలి. ఆదాయ వ‌న‌రులు ఏమిటో చెప్పాలి. కేటీఆర్ కు ఏమాత్రం నిజాయితీ ఉన్నా రేప‌టి లోగా స్వ‌చ్ఛందంగా ఆస్తుల వివ‌రాలు చెప్పాలి.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి క‌ల్వ‌కుంట్ల కుటుంబ ఆస్తుల‌ను ప్ర‌క‌టించారు. తెలంగాణ ఉద్య‌మ కారులు త‌మ ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టి ఉద్య‌మంలో పాల్గొన్నారు. కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ త‌న కోట్లాది రూపాయ‌ల విలువైన ఆస్తుల‌ను ఉద్య‌మం కోసం తాక‌ట్టు పెట్టారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు మీరు గ‌జం భూములు ఇవ్వ‌లేదు..మీకు మాత్రం వంద‌ల ఎక‌రాలు ఎలా వ‌చ్చాయి?

బీఆర్ఎస్ నాయ‌కులు కొడంగ‌ల్ లో మీటింగ్ పెట్టుకోవ‌చ్చు. క‌విత కూడా ఇటీవ‌ల కొడంగ‌ల్ లో స‌భ పెట్టింది.కొడంగ‌ల్ ప్ర‌జ‌లు చంప‌లు వాయిస్తారు.. జాగ్ర‌త్త‌. ఎన్నిక‌ల‌ను కాస్ట్లీ చేసింది బీఆర్ఎస్ పార్టీనే. ఉప ఎన్నిక‌ల్ల‌లో వేల కోట్లు ఖ‌ర్చు పెట్టిన చ‌రిత్ర బీఆర్ఎస్ ది. దొర‌ల‌కు మించిన అహంకారంతో త‌మ ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంద‌ని క‌ల్వ‌కుంట్ల కుటుంబం విర్ర‌వీగుతోంది. న‌యా నిజాం లా కల్వ‌కుంట్ల కుటుంబం మారింది..

కేసీఆర్ కుటుంబం ఫామ్ హౌస్ లు, కోట‌లు, విల్లాలు, హోట‌ళ్లు చూసి తెలంగాణ జ‌నం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అర‌వై కోట్ల విలువ చేసే హోట‌ళ్లు ఉన్న కేటీఆర్ కు 600 గ‌జాల ఇంటి స్థలం లేదంటే జ‌నం న‌మ్ముతారా? త్యాగాల పునాదుల మీద ఏర్ప‌డింది తెలంగాణ‌. తెలంగాణ‌ను దోచుకున్న ఎవ‌రిని ప్ర‌జ‌లు వ‌దిలిపెట్ట‌రు.గుర్తు పెట్టుకోండి. సిరిసిల్ల స‌భ‌తో కేటీఆర్ కు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. భ‌విష్య‌త్తులో హ‌రీష్ రావుకు కూడా ఇదే ప‌రిస్థితి..

తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న వారికి కేసీఆర్ ఏ నాడైనా ఒక టీ తాగించారా? కేసీఆర్ ఏర్పాటు చేసుకున్న కారిడార్ క‌థ‌ల‌ను సీరియ‌ల్ గా చెపుతాం. ఐఎఎస్ అధికారిణి దేవ‌సేన నేతృత్వంలో భూముల‌పైన క‌మిటీ ఏర్పాటు చేశాం. నా పిల్ల‌ల‌ను అమెరికాలో చ‌ద‌వించ‌డానికి నా జీవితాన్ని పెడుతున్న‌. అఫిడ‌విట్ లో నేను ప్ర‌క‌టించిన నా ఆస్తుల కంటే ఎక్కువ గా ఉంటే చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు.ప్ర‌శ్నించే వాళ్ల‌ను ట్రోల్ చేయ‌డ‌మే బీఆర్ఎస్ ప‌ని.

మా సీఎం రేవంత్ రెడ్డి దేనికైనా సిద్ధంగా ఉన్నారు.కాలం క‌న్న నాయ‌కుడు రేవంత్ రెడ్డి.. ప్ర‌జ‌లే లీడ‌ర్లను త‌యారు చేస్తాడు. అలాంటి నాయ‌కుడే రేవంత్ రెడ్డి. మ‌ళ్లీ బీఆర్ఎస్ కు అధికారం క‌ల్ల‌.. తెలంగాణ ప్ర‌జ‌లు మీపైన ఉమ్మేస్తున్నారు. అబ‌ద్దాల‌కు పెద్ద కొడుకు కేసీఆర్. చిన్న కొడుకు కేటీఆర్. సీఎం ప‌ద‌వి కోసం క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో పోటీ నెల‌కొన్న‌ది. విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డే అక్ర‌మాస్తుల‌ను తెలంగాణ ఉద్య‌మకారుల కుటుంబాల‌కు పంచాలి. బీఆర్ఎస్ హ‌యాంలో ద‌ళితుల ప‌రామ‌ర్శ‌కు మారు వేషాల్లో వెళ్లాల్సిన ప‌రిస్థితి ఉండేది.

క‌ల్వ‌కుంట్ల కుటుంబం అంటేనే తెలంగాణ క‌బ్జాదారులు,దోపిడిదారులు. కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను పాలించ‌లేదు.దోచుకున్నాడు. బీఆర్ఎస్ భూస్థాపితం కావ‌డానికి కేటీఆర్ ఒక్క‌డు చాలు. క‌ల్వ‌కుంట్ల ఆస్తుల‌పైన విచార‌ణ‌కు వెన‌క్కి త‌గ్గొద్ద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ అధ్య‌క్షుడు. కొడుకు కేటీఆర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్..టీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హ‌రీష్ రావు. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మీరంతా వాళ్ల కోస‌మే ప‌నిచేస్తున్నారా?

మాక్ అసెంబ్లీలో మాత్రం సీఎం గా త‌ల‌సానిని పెట్టారు. యుద్ధంలో వీరుడు ముందుంటాడు. కేటీఆర్ లా వెనుక నుంచి తోయ‌డు. సెప్టెంబ‌ర్ 30 న స‌క‌ల జ‌నుల స‌మ్మెకు రాకుండా క‌ల్వ‌కుంట్ల కుటుంబం పిల్లుల్లా పారిపోయింది. కేటీఆర్ కు ద‌మ్ముంటే తానే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అని ప్ర‌క‌టించుకోవాలి. కేటీఆర్ కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ప‌ద‌వి కూడా కేసీఆర్ ఇవ్వ‌లేదు. కేసీఆర్ త‌ప్ప ఆ పార్టీకి దిక్కులేదు.. ఆయ‌న బిక్కు బిక్కుమనుకుంటు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కేటీఆర్ ముఖ్య‌మంత్రి అని ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణం బీఆర్ఎస్ పార్టీ కుప్ప‌కూలిపోతుంది.. హ‌రీష్ రావు తిరుగుబాటు చేస్తడు. సినిమాల్లో శంక‌ర‌న్న పాత్ర చూసుకుని బీఆర్ఎస్ నాయ‌కులు సంబ‌ర‌ప‌డుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక కేటీఆర్, హ‌రీష్ రావు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన వారం రోజుల నుంచి దుష్ప‌చారం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం హ‌రీష్ రావు, కేటీఆర్ ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబ దోపిడిని అసెంబ్లీ సాక్షిగా మా సీఎం రేవంత్ రెడ్డి బ‌య‌ట‌పెట్టారు.

మా సీఎం ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక చిల్ల‌ర మ‌ల్ల‌ర మాట‌లు మాట్లాడుతున్నారు. సిరిసిల్ల స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో భ‌రించ‌లేక‌పోతున్నారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించింది న‌ల్ల‌మ‌ల్ల పులి రేవంత్ రెడ్డినే. 2014 కు ముందు మీ ఆస్తులెంత‌? అధికారంలోకి వ‌చ్చాక వ‌చ్చిన ఆస్తులెన్ని? పేద కేటీఆర్ కు ఉండ‌టానికి ఇళ్లు లేదంట‌. హైద‌రాబాద్ న‌డి బొడ్డులో 5 వేల కోట్ల విలువ చేసే ఫైవ్ స్టార్ హోట‌ళ్లు ఉన్నాయి. 410 గ‌దులుంటే నేను, మా అయ్య ఉండ‌టానికి ఇళ్లు లేద‌ని సిగ్గులేకుండా కేటీఆర్ చెపుతున్నాడు.

తేళుకుంట్ల శ్రీధ‌ర్, ప‌ట్టాభిరామారావును బెదిరించి హోట‌ళ్‌ళ‌ళ‌క్ష 25 శాతం వాటా తీసు కున్నారు. కేటీఆర్ త‌న భార్య పేరుతో వాటాను ఆ త‌ర్వాత 50 శాతానికి పైగా పెంచుకున్నారు. వేల కోట్ల ఆస్తుల‌ను అక్ర‌మంగా రాయించుకున్నారు. సిరిసిల్ల‌కు వ‌చ్చి బ‌ట్ట‌లు ఇప్పామ‌నే కేటీఆర్ మాట్లాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిరిసిల్ల‌లో డిపాజిట్ రాకుండా చేస్తాం జాగ్ర‌త్త‌.

కేసీఆర్ ని బ‌ట్ట‌లు ఇప్పించి కొడ‌తామ‌ని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గ‌తంలో అన‌లేదా? గ‌త ప్ర‌భుత్వంలో గొర్రెలు, బ‌ర్రెలు, చేప‌ల స్కాంలు చేశారు. తెలంగాణ ఏ గ్రామం పోయినా బీఆర్ఎస్ నాయ‌కుల‌ను రాళ్ల‌తో కొడ‌తారు.
ముఖ్య‌మంత్రి స‌భ పెడితే పోలీసులు ఉండ‌టం స‌హ‌జం. సిద్దిపేట‌, గ‌జ్వేల్ లో కూడా ల‌క్ష‌లాది మంది స‌భ పెట్టి మిమ్మ‌ల్నీ ఛీ కొట్టిస్తాం. కొడంగ‌ల్ లో స‌భ పెట్టుకోండి.ఏమీ చేయ‌లేరు. వ‌చ్చే ఐదేళ్లు కూడా ప్ర‌జా ప్ర‌భుత్వ‌మే ఉంటుంది.

Total Visitors: 2,854,744