Suryaa.co.in

Telangana

టీడీపీని బీఆర్ఎస్ ఫాలో అవుతుంది

-ఏపీ నుండి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు
-నీట్ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి
-గ్రేస్ మార్కులను కలపడంపై అనుమానాలు
-త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం
-జోవో 46 పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం
-మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: నీట్ పరీక్ష నిర్వహణలో, ఫలితాల అంశంలో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగింది,దీనిపై కేంద్రం స్పందించాలి.బాధ్యత గల అధికారులపై చర్యలు తీసుకోవాలి. Feb 9 నుండి నెలరోజుల పాటు దరఖాస్తులు అనుమతించింది కేంద్రం. వారం రోజులు అప్లై చేసే గడువు పొడిగించింది.

కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని ఘటనలు జరిగాయి. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉంది.కానీ జూన్ 4న రిజల్ట్ ఇవ్వడంతో అనుమానాలు మరింత పెరిగాయి. విద్యార్థులు అనేక సంఘాలు ఆందోళన చేశాయి. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ రావడం మరింత అనుమానానికి దారితీసింది.

నీట్ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి. పోటీ పరీక్షల నిర్వహణలో ప్రధానంగా వైద్య విద్యలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. గ్రేస్ మార్కులను కలపడంపై కూడా అనుమానాలు ఉన్నాయి. NDA సర్కార్ పూర్తి స్థాయిలో విఫలమైంది. నీట్ పై నమ్మకం కలిపించేలా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రంపై ఉంది.

సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పునరాలోచన చేయాలి. కిషన్ రెడ్డి ఒక వైపు ప్రైవేట్ పరం చేయం అని అంటునే..మరోవైపు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే పనిలో కేంద్ర సర్కార్ ఉంది.

అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నాయి. కిషన్ రెడ్డి ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నాడు. దానిపై ప్రధాని ని సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడతారు. బిఆర్ఎస్ పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచన చేసుకోండి. లేదంటే భవిష్యత్ లో ఒక్క సీటు కూడా రాదు. శాంతి భద్రతల విషయంలో సర్కార్ అలర్ట్ గా ఉంది. ఎవరు విఘాతం కలిగించిన సహించేది లేదు.

ఏపీ కొత్త ప్రభుత్వం నుండి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. టీడీపీ ని బీఆర్ఎస్ ఫాలో అవుతుంది. తెలంగాణ ప్రజలు మాకు పట్టం కట్టారు.. వారి ఆలోచన మేరకు పాలన ఉంటది. అడ్డగోలుగా బిఆర్ఎస్ నేతలు తీసుకున్నట్లుగా మేము తీసుకోము. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.జోవో 46 పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకూడదనే జాగ్రత్తగా ఉద్యోగ నియామక పక్రియ చేపడుతున్నాం.

LEAVE A RESPONSE