అభివృద్ది చెందిన కుప్పంను పులివెందులలా అభివృద్ది చేస్తామని అనటం హాస్యాస్పదం

టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి)

జగన్ మోహన్ రెడ్డి 5 రోజుల క్రితం కుప్పం నుంచి స్థానిక నాయకులు 15 మందిని తాడేపల్లికి పిలిపించి కుప్పంను పులవెందుల స్థాయికి తీసుకెళతానని చెప్పడం హాస్యా్స్పదం. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి 63కోట్లు విడుదల చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. గతంలోనే చంద్రబాబు కుప్పంను ఎంతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చెందని ప్రొంతాన్ని అభివృద్ధి చేస్తామంటారుగానీ అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉంది. దీన్ని బట్టి రాష్ట్రాన్ని పురోగమనంవైపు తీసుకెళ్తున్నారో, తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారో అర్థం కావడంలేదు. చంద్రబాబు హయాంలో రూ. 600కోట్లు ఖర్చుచేసి పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చారు. జగన్ పులివెందుల బస్టాండ్ ను అభివృద్ధి చేయలేకపోయారు. నేడు జగన్ 63కోట్లు కుప్పం మున్సిపాలిటీకి ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గాలి జనార్థన్ రెడ్డికి 14 ఎకరాలు ఇస్తే దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.వెయ్యి కోట్లు తీసుకొని జైలుకు వెళ్లి నాశనం చేశారు. 15 వేల కోట్లు విలువైన మైన్స్ ని కూడా గాలి జనార్థన్ రెడ్డికి ధారాదత్తం చేశారు. ఇప్పటికీ దీనిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. గాలి జనార్థన్ రెడ్డిపై వివాదాలు రేగినప్పుడు గాలి జనార్థన్ రెడ్డి ఎవరో నాకు తెలియదని అన్నారు. ఇప్పుడు మైన్స్ ధారాదత్తం చేస్తున్నారు. మద్యం, ఇసుక నుండి రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తోంది. దాన్ని ఏం చేస్తున్నారో తెలియదు. రాయలసీమవాసులకు జగన్ తీరని ద్రోహం చేశారు.

2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2వేల 5వందల కోట్ల అంచనాలతో గండికోట నుంచి చిత్రావతికి సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టి కేవలం 10కోట్ల పని చేసి చేతులు దులుపుకున్నారు. చిత్రావతికి కావలసినంత నీరు ఉన్నా పనులు మాత్రం సున్నా. పులివెందల ఇరిగేషన్ అంతా కూడ మైక్రో ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. మైక్రో ఇరిగేషన్ మంజూరు చేయకపోవడం బాధాకరం. వంద ఎకరాలకు ఒక సంపు నిర్మించి అక్కడ నుంచి పైపుల ద్వారా మైక్రో ఇరిగేషన్ ద్వారా రాజశేఖర్ రెడ్డి డెవలప్ చేయడం జరిగింది. జగన్ రెడ్డి మైక్రో ఇరిగేషన్ కోసమని టెండర్ కి పిలిచి వాళ్ళకు ఒక్క రూపాయి కూడ బిల్లు చెల్లించకపోవడంతో మెగా సంస్థ పలాయనం చిత్తగించింది.

పులివెందుల పరిసర ఇరిగేషన్లలో కావసినంత నీరు ఉన్నా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు. వేంపల్లికి నీరు సరఫరా జరగాలంటే మైక్రో ఇరిగేషన్ ద్వారా జరగాలి. పులివెందులకు ఫండ్స్ ను విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. పులివెందుల రైతులకు పైడిపాలం, చిత్రావతిలో నీరు ఉంది, గ్రౌండ్ వాటర్ పెరిగింది హార్టీ కల్చర్ బెల్ట్ దానికి సంబంధించిన డ్రిప్ మెటీరియల్ అడుగుతున్నప్పటికి ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రతిష్టాత్మాకంగా పనులు చేపడుతున్నాననడం బూటకం. పులివెందులలో ఎక్కడ స్కూళ్లకు కావాల్సిన మెటీరియల్ ని సప్లై చేయలేదు.

జగన్ రెడ్డి సొంత మండలమైన సింహాద్రిపురంలో నాబాట నిదులతో స్కూల్ బిల్డింగ్ మంజూరు అయినా నిధులు లేక మొండి గోడలకే పరిమితమైంది. చంద్రబాబు సహాయ సహకారాలతో కుప్పంలో మెడికల్ కాలేజీ వచ్చింది, ద్రవిడ యూనివర్సీటీని కూడ పెట్టారు, అక్కడ ఇజ్రాయిల్ టెక్నాలజీతో వ్యవసాయం చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే కుప్పం అభివృద్ధి చెందింది. పులివెందులలోని మెడికల్ కాలేజీలో గతంలో వై.యస్. రాజశేఖర్ రెడ్డి 5 సవంత్సరాలు, నేడు జగన్ రెడ్డి 3 సంవత్సరాలు పని చేసినా అభివృద్ధి చెందలేదు. ఆ మెడికల్ కాలేజేకి సెంట్రల్ నుంచి అనుమతులు లేవు, లోన్ కోసం వెళ్లిన లోన్ రాలేదు. అనుమతులు లేవు. మాట్లాడితే కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేశానని కుప్పాన్ని మున్సిపాలిటీ చేశానని చెప్పుకుంటున్నారు. గతంలో వై.యస్. రాజశేఖర్ రెడ్డి 5 సవంత్సరాలు, జగన్ రెడ్డి 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయకుండా నేడు చేశారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ చేస్తే అభివృద్ధి జరగదు.

పరిపాలనా సౌలభ్యం కోసం చేసే దాన్ని అభివృద్ధి అనరు. జనాభా పెరిగి కుప్పాన్ని మున్సిపాలిటీ చేస్తే కరెక్ట్ అవుతుంది కాని, చుట్టు పక్కల పది ఊర్లను కలిపితే కాదు. కనీసం ఆ 10పల్లెలలో కూడ ఏ మాత్రం కనీస సౌకర్యాలు లేవు, రోడ్లు లేవు కాని మున్సిపాలిటీ ప్రకారం ప్రజలు మాత్రం టాక్స్ లు కడుతున్నారు. అక్కడున్న వారికి ఉపాధి హామీ జాబ్ కార్డ్ పోయే పరిస్థితి వుంది. ఇవి పులివెందులలో ఉన్న వాస్తవాలు. పులివెందులలో బస్టాండ్ నిర్మించడానికి అనుమతులు వచ్చి 3 సంవత్సరాలు గడిచినా బస్టాండ్ నిర్మాణం మాత్రం జరుగలేదు. సరైన ప్రత్నామ్యాయం చూపించకుండా బస్టాండ్ ని కూల్చివేశారు. తూతూమంత్రంగా రేకులతో, తడికలతో షెడ్ ని వేసి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. నేటికి బస్టాండ్ నిర్మాణం పూర్తి కాలేదు. మూడు రాజధానులు నిర్మిస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత నియోజక వర్గంలో ప్రయాణికుల కోసం ఒక బస్టాండ్ ని కూడ నిర్మించలేదు. కుప్పంను పులివెందులతో పోలుస్తూ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నాడు. పులివెందుల ప్రజలు చేపలు, రొయ్యలు ఎప్పుడూ తిననట్టు జగన్ రెడ్డి మహత్కార్యం చేస్తున్నట్టు చేపలు, రొయ్యలకు సంబంధించిన షాపులు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరని చెబుతున్నారు. జగన్ రెడ్డి ప్రారంభించిన దుఖాణాలు ఆయన వచ్చినప్పడు మూత పడుంటే బాగుండదని జగన్ రెడ్డి పులివెందులకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న నాయకులు భంగపడి విడిగా చేపలు అమ్ముకొనే వారిని తీసుకొచ్చి జగన్ రెడ్డి ఓపెనింగ్ చేసిన దుఖాణాల వద్ద అమ్ముకొనే విధంగా ఉంచుతున్నారు. పులివెందుల అభివృద్ధి కోసం జగన్ రెడ్డి చేసిందేంటి. పులివెందులలో జగన్ రెడ్డి వస్తేనే పులివెందుల అమాంతం అభివృద్ధి చెందుతుందని, ఇండస్ట్రీలు వస్తాయని రియలస్టేట్ లో పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు దాపురించాయి. పులివెందులలో ఉన్న యువత కోసం ఒక్క ఇండస్ట్రీని తీసుకురాలేదు. ఒక్కరికి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. జగన్ రెడ్డి సొంత బాబాయిని చంపారు. చంపి, సొంత మనుషులని కూడ దయా దాక్షిణ్యాలు లేకుండా చంపుకుంటు వస్తున్నారు.

ఇసుక, మద్యంలో కావాల్సినంత ఆదాయం వచ్చింది జగన్ రెడ్డికి, రాష్ట్రంలో మిగిలింది ఐరన్ హోర్ దానిలో ఏ విధింగా లబ్ధి పొందాలని గాలి జనార్థన్ రెడ్డికి కట్టబెట్టడానికి ప్రణాళిక రచించారు. జగన్ రెడ్డి కడప జిల్లాకు, రాయలసీమకు ద్రోహం చేశారు. జగన్ రెడ్డికి ఇండస్ట్రీలని నిర్మించడం రాదు. నేను గతంలో స్టీల్ ప్లాంటుకోసం ఉక్కు దీక్షను చేపట్టాం. దాన్ని బేస్ చేస్తే అయినా కొంత మందికి అయినా ఉపాధి వస్తుందన్న ఆలోచన జగన్ రెడ్డికి లేదు. జగన్ రెడ్డి తన సొంత ఖజానాని పెంచుకోవడానికి గాలి జనార్థన రెడ్డి కంపెనీ అంటే ఆర్.ఆర్.గ్లోబల్ దాంతో అటాచ్మెంట్, ఆర్.ఆర్.గ్లోబల్ డైరెక్టర్ సాక్షి డైరెక్టర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. వాళ్ల సంస్థలలో పెట్టుబడులు పెట్టించి బై బ్యాక్ మనీ చేశారు. 175 నియోజక వర్గాలు అని పాట పాడుతున్న జగన్ రెడ్డి నేడు పులివెందులలో గెలిచి చూపించాలి. సొంత చెల్లెలు, అమ్మని పార్టీలో ఉండనివ్వకుండా పంపిచేవేశాడు, సొంత బాబాయి కూతురిని కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాడు జగన్ రెడ్డి. పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిని ఎన్నుకున్నందుకు కనీసం వారికి తనని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడ ఇవ్వడంలేదు. సొంత కుటుంబ సభ్యులకు అన్యాయం చేసిన వాడు ప్రజలకు న్యాయం చేస్తాడా.

జగన్ రెడ్డిని కలిసిన కుప్పం నాయకులు గాని, స్థానికులు గాని వారికి స్వయంగా సదుపాయాలు కల్పిస్తాం పులివెందులకు వచ్చి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏపాటి ఉందో తెలిసుకోని కుప్పంతో బేరీజు వేసుకొని జగన్ రెడ్డి మనస్తత్వం ఏంటో తెలుసుకోండి. ఒక్క ఛాన్స్ అని రాష్ట్ర ప్రజలు, పులివెందులు ప్రజలు మోసపోయారు. అదే విధంగా మరోసారి కుప్పం ప్రజలు మోసపోవద్దన్నారు. 95శాతం ఎన్నికల మేనిఫెస్టో హామీలు తీర్చామన్నారు మిగిలిన 5శాతం హామీలు ఏంటో, చేసిన 95శాతం హామీలు ఏంటో కూడ ప్రజలకు తెలియజేయాలన్నారు.

పులివెందులలో వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్యాయంగా కేసులు భనాయించడంతో జీవిత ఖైదు పడిన వారికి చంద్రబాబు నాయుడు మానవత థృక్పతంతో జీవో ఇచ్చారు. ఆ జీవో ద్వారా కొంత మంది ఖైదీలు వారి సతప్రవర్తన ద్వారా బయటికొచ్చారు. విడుదల అయిన ఖైదీలు జగన్ రెడ్డి వల్ల పులి వెందులలో జరిగిందంతా ఫ్యాక్షన్ ఇజం తప్పా జరిగిందేం లేదని చంద్రబాబుకి విన్నమించుకున్నారు. ఏం జరిగినా పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిని గెలిపిస్తారు అనే ధీమాతో బాధ్యతలన్నీ అవినాష్ రెడ్డికి అప్పగించాడు జగన్ రెడ్డి. అవినాష్ రెడ్డికి చేతులు తడిపితేనే ముఖ్యమంత్రి అపాయింట్మంట్. మొత్తానికి జగన్ కుప్పంను అభివృద్ధి చేస్తామని చెబుతున్న కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దని టీడీపీ తరపున సూచిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.

Leave a Reply