చంద్రబాబుకు బైబై…పవన్‌కళ్యాణ్‌కు ప్యాకప్‌

-అందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు
-వైయస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది
-మా బస్సు యాత్రకు 2 రోజుల మందు కోనసీమ అల్లర్లు
-నీకు స్థిరత్వం లేదని మీ పార్టనర్‌ బీజేపీ కూడా భావిస్తోంది
-నీకు ఆ పార్టీ పెద్దలు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు
-తునిలో రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) ప్రెస్‌మీట్‌:

తుని: ప్రెస్‌మీట్‌లో మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) ఇంకా ఏం మాట్లాడారంటే..:
ఆ అల్లర్లకు మీరే కారణం:
సామాజిక న్యాయం అనే వజ్రాయుధాన్ని జగన్‌ ప్రయోగిస్తే, దానికి మాడి మసైపోతామని భయపడిన తెలుగుదేశం పార్టీ, జనసేన కోనసీమలో అల్లర్లకు కారణమయ్యారు. గత నెల 24న అమలాపురంలో అల్లర్లు జరిగితే, 26న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మొదలైంది. దీన్ని బట్టే, అల్లర్లు ఎందుకు జరిగాయన్నది, ఎవరు చేశారని, ఎవరు ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నించారన్నది అర్ధమవుతుంది.

మీకేమైనా చెవిలో చెప్పారా?:
కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయని పవన్‌కళ్యాణ్‌ చెబుతున్నారు. మరి వారికి కానీ, చంద్రబాబుకి కానీ కేంద్ర నిఘా వర్గాలు ఏమైనా చెవిలో ఆ విషయం చెప్పాయా?.
అలాగే జిల్లాకు పేరు మార్పుకు నోటిఫికేషన్‌ ఇచ్చి, నెల రోజులు సమయం ఇచ్చారని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారు. ఏ జిల్లాకు అయినా అదే సమయం ఇస్తారు. మిగతా జిల్లాలకు కూడా అలాగే సమయం ఇచ్చారు.
అయితే మిగతా జిల్లాల పేర్లకు రాని అభ్యంతరాలు ఇక్కడ ఎందుకు వచ్చాయి?

అసలు మీ వైఖరి ఏమిటి?:
కాబట్టి జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై మీ జనసేన పార్టీ వైఖరి, మీ పార్టనర్‌ చంద్రబాబు వైఖరి ఏమిటన్నది ఇప్పటికైనా స్పష్టం చేయాలి.
ఎందుకంటే కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెడితే, మీరు, మీ పార్టనర్‌ పార్టీలు నానా అల్లర్లు చేసి, దళిత మంత్రి విశ్వరూప్‌ ఇల్లు, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లు తగలబెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. అయితే ఆ పనులు ఎవరు చేసినా, వదిలి పెట్టేది లేదు. నిజానికి కోనసీమలో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలే కారణం. పక్కా ఆధారాలతోనే నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

అసలు వర్గ శతృవులు ఎవరు?:
మీరు పదే పదే వర్గ శతృవులు అంటున్నారు. మరి ఎవరు ఎవరికి వర్గ శతృవులు? రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు జగనన్న పక్షాన ఉన్నారు. మరి వర్గ శతృవులు ఎవరు? మీరు పదే పదే అలా మాట్లాడడం హాస్యాస్పదం.

నీ కళ్లతో చూడు:
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. విత్తనాలు మొదలు, పంటల అమ్మకాల వరకు అడుగడుగునా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోంది గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి. అందుకే నీవు చంద్రబాబు, నాదెండ్ల మనోహన్‌ కళ్లతో కాకుండా స్వయంగా నీ కళ్లతో చూడు. అప్పుడు రాష్ట్రంలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారనేది అర్ధమవుతుంది. జగన్‌ పాలనలో రాష్ట్రం ఎంతో సుబిక్షంగా ఉంది. ఆయన సుపరిపాలన చేస్తున్నారు.

అదే నీ లక్ష్యం. అందుకే..:
కానీ నీవు మనసులో ఏదో పెట్టుకుని, రాష్ట్రం అధోగతి పాలు కావాలని, శ్రీలంకలా మారాలని, రాష్ట్రం తగలబడి పోవాలని అనుకుంటున్నావు. అలాగే నీవు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఏదేదో మాట్లాడుతున్నావు.
నీ సమావేశాల్లో నీ అభిమానులు నిన్ను సీఎం సీఎం అంటుంటే, నీవు వారిని పట్టించుకోకుండా.. చంద్రబాబు సీఎం అంటున్నావు. కాబట్టి నీవు, నీ అభిమానులు దాన్ని గమనించాలి.
గతంలో నీవొక ట్వీట్‌ పెట్టావు. టీవీ5, ఏబీఎన్‌ ఛానళ్లను బహిష్కరించాలని. కానీ ఇవాళ అవే ఛానళ్లను నెత్తిన పెట్టుకుంటున్నావు. దీని గురించి నీ అభిమానులు ఏమనుకుంటారనేది ఒకసారి ఆలోచించు.

కుళ్లుతో నిప్పు:
రాష్ట్రంలో ఎలా సామాజిక న్యాయం జరిగిందనేది అందరికీ తెలుసు. అలాగే మహిళలకూ మేలు జరుగుతోంది. వారికి గౌరవం ఇవ్వడంలో సీఎం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవన్నీ చూస్తున్న నీవు, చంద్రబాబు మనసులో ఒక కుళ్లు పెట్టుకుని, గోదావరి జిల్లాలో ఇద్దరూ నిప్పు పెట్టారు. అందుకు ప్రజలు మీకు కచ్చితంగా బుద్ధి చెబుతారు.
అలాగే పోలీసులు కాపలాగా ఉంటే, సెక్షన్‌–144 పెడితే, అల్లర్లు ఎలా జరిగాయని అంటున్నావు. ఇది చాలా విచిత్రంగా ఉంది. నిజానికి అల్లరి మూకలు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. ఏకంగా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసి తగలబెట్టారు. తమను తీవ్రంగా గాయపర్చినా పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. అందుకే కాల్పులు జరపలేదు. ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ కూడా చేయలేదు. ఎవరినీ కనీసం గాయపర్చలేదు.

అందరూ అలా అనుకుంటే, నీవు ఇలా..:
ఎవరైనా సరే మా ఊరు బాగుండాలి. మా ప్రాంతం బాగుండాలి. మా రాష్ట్రం బాగుండాలి అనుకుంటారు. కానీ నీవు మాత్రం చంద్రబాబు మాత్రం బాగుండాలి. రాష్ట్రం కాలిపోవాలి. చంద్రబాబు తప్ప ఎవరూ పాలించకూడదు అని అనుకుంటున్నావు.
నీ విషయాన్ని అందరూ పసిగట్టారు. అందుకే రానున్న రోజుల్లో గోదావరి జిల్లాలో చంద్రబాబుకు బైబై, పవన్‌కళ్యాణ్‌కు ప్యాకప్‌ చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. వైయస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది.

నీ మిత్రులే నమ్మడం లేదు:
నీకు స్థిరత్వం లేదు. నీకు నాయకత్వ లక్షణాలు లేవు. రాజకీయంగా నీవు ఏ మాత్రం పనికిరావు అని తెలిసిన నీ మిత్రులు.. చివరకు నీకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా నిన్ను దగ్గరకు రానివ్వడం లేదు.

‘గడప గడపలో ఆదరణ:
మా ప్రభుత్వ పాలన చాలా బాగుంది. గడప గడపకూ కార్యక్రమంలో ప్రతి చోటా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. ప్రతి ఇంటికీ ఒకటికి మించి ప్రభుత్వ పథకాలు అందాయి. అందుకే వారెంతో సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని ఆదరిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇవాళ అలా ఇంటింటికీ వెళ్లే ధైర్యం ఒక్క వైయస్సార్‌సీపీకి మాత్రమే ఉంది.. అని మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.

Leave a Reply