• తమకున్న తక్కువ సమయంలో రెట్టింపుదోపిడీ చేయాలన్నదే జగన్, అతని మంత్రులు ఆలోచన
• నిన్నటి కేబినెట్ సమావేశం చూస్తే ముఖ్యమంత్రి రాష్ట్రంలోని భూములపై క్లియరెన్స్ సేల్ పెట్టినట్టు అర్థమైంది
• చిత్తూరుడెయిరీసహా, 29ఎకరాలభూమిని జగన్మోహన్ రెడ్డి 99ఏళ్లు అమూల్ కు లీజుకివ్వడం క్విడ్ ప్రోకో లో భాగమే
• టీడీపీప్రభుత్వం వచ్చినవెంటనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతినిర్ణయాన్ని సమీక్షిస్తుంది
• ముఖ్యమంత్రిని, మంత్రుల్ని నమ్మి ముందుకెళ్లేవారందరికీ మొసళ్లపండగ ముందుంటుంది
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
4 ఏళ్లలో రాష్ట్రంలోని సహజవనరుల్ని, ప్రజలసంపదను, ప్రభుత్వఆస్తుల్ని అడ్డగో లుగా దోచేసిన జగన్మోహన్ రెడ్డి అతనిదొంగలముఠా, నిన్నటి కేబినెట్ సమా వేశంలో చివరి 9నెలలకాలాన్ని మరింతగా సద్వినియోగంచేసుకొని, రెట్టింపు ఉత్సాహంతో దొరికిందంతా దోచుకోవడానికి ప్రణాళికలు వేసినట్టు స్పష్టమవుతోం దని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
కేబినెట్ సమావేశ నిర్ణయాలుచూస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో క్లియరెన్స్ సేల్ కు తెరలేపినట్టుంది.
“జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపాలన తుదిదశకు చేరింది. నిన్నటి కేబినెట్ సమావేశం చూస్తే ముఖ్యమంత్రి రాష్ట్రంలోని భూములపై క్లియరెన్స్ సేల్ పెట్టినట్టు అర్థమైంది. పెద్దపెద్ద షాపింగ్ మాళ్లలో మాదిరి వైసీపీప్రభుత్వం రాష్ట్రంలోదోపిడీకి సంబంధించి క్లియరెన్స్ సేల్ కు తెరలేపింది. మొన్నటివరకు వైనాట్ 175 అని ప్రగల్భాలు పలికిన జగన్, నిన్న కేబినెట్ సమావేశంలో మంత్రుల్ని బాబ్బాబు అని బతిమాలుకునే దుస్థితికి వచ్చాడు. 9నెల్లలో ఎన్నికల్లో పోటీకి సిద్ధంకండి అని వేడుకుంటున్నాడు. నిన్నటి కేబినెట్ సమావేశం తీరుచూశాక , వైసీపీ ప్రభుత్వం దివాలా అంచులకు చేరినట్టు సుస్పష్టమవుతోంది. తమకు మిగిలిన 9నెలల్లో ఇంకాఇంకా దొరికినంత దోచుకోండి అనేలా ముఖ్యమంత్రి, మంత్రివర్గ నిర్ణయాలున్నాయి.
63 నిర్ణయాల్లో 23 భూములకు సంబంధించినవే… కేబినెట్ సమావేశంలో ప్రజలసమస్యలు ఏవీ ముఖ్యమంత్రికి, మంత్రులకు కనిపిచంలేదు. చిత్తూరు డెయిరీని అమూల్ పరం చేయడం క్విడ్ ప్రోకోనే
రాష్ట్రంలోని సమస్యలు, రైతులు, యువత, మహిళలు, ఉద్యోగుల ఇబ్బందులు, కష్టాలు ఏవీ కేబినెట్ కు కనిపించలేదు. కేబినెట్ సమావేశంలో 63 నిర్ణయాలు తీసుకుంటే, 23నిర్ణయాలు భూములకు సంబంధించినవే. భూములు కొట్టేయడం పైనే కేబినెట్ శ్రద్ధపెట్టింది. 22ఏ భూములు, ఇతరవివాదాల్లోని భూముల్ని తనపార్టీవారికి, తనవర్గానికి కట్టబెట్టేందుకు జగన్ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఇప్పటికే విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.40వేలకోట్ల విలువైన భూముల్నిమింగేశారు. గుజరాత్ సంస్థ అమూల్ ను అనేకరాష్ట్రాలు తిరస్క రిస్తుంటే, ఏపీప్రభుత్వంమాత్రం రూ.5వేలకోట్ల ప్రజలసొమ్ముని కట్టబెట్టి మరీ రాష్ట్రంలోని పాడిపరిశ్రమను నాశనంచేయడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని పాడి రైతులకు లీటర్ కు 4రూపాయలు ఇస్తానన్న బోనస్ఏమైందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. చిత్తూరు డెయిరీ సహా, దానిపరిధిలోని 29ఎకరాలభూమిని జగన్మోహన్ రెడ్డి 99ఏళ్లపాటు అమూల్ కు లీజుకిచ్చాడు.
రాష్ట్రంలోని పాడి రైతులు, సహాకార సంఘాలు, పాడిపరిశ్రమపై ఆధారపడిబతికే కుటుంబాలు ఏవీ ముఖ్యమంత్రికి కనిపించడంలేదా? గుజరాత్ సంస్థకు మేలుచేస్తే ఏపీసొమ్మంతా ఆసంస్థకు పోతుంది. ఏపీలోని పాడిపరిశ్రమకు, పాలడెయిరీలకు న్యాయంచేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. చిత్తూరు డెయిరీని అమూల్ సంస్థకు కట్టబెట్టడం క్విడ్ ప్రోకోలో భాగమే. టీడీపీప్రభుత్వం వచ్చినవెంటనే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ పరంగా తీసుకున్న ప్రతినిర్ణయాన్ని సమీక్షిస్తుంది.
ప్రజలఆస్తులు, భూములు, ప్రభుత్వభూములు కొట్టేసినవారిని, వారికి సహకరించిన అధికారుల్ని, వ్యవస్థల్ని టీడీపీప్రభుత్వం వదిలిపెట్టదు. ముఖ్యమంత్రిని, మంత్రుల్నినమ్మి నిబంధనలు, చట్టాలకు తిలోదకాలిచ్చి ముందుకెళ్లేవారందరికీ మొసళ్లపండగ ముందు ఉంటుంది.” అని బొండా ఉమ హెచ్చరించారు.