ఏపిలో సీపీఎస్ రద్దు సాహసోపేతం

– సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్ ప్రచార కార్యదర్శి
-నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రెస్టారేషన్ జాతీయ కార్యదర్శి మాచన రఘునందన్

ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయడం చారిత్రక పరిణామం అని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రెస్టారేషన్ జాతీయ కార్యదర్శి, భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అభిప్రాయపడ్డారు. గురువారం నాడు ఆయన తిరుపతిలో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా ఎనభై లక్షలపై చిలుకు ఉద్యోగులు సీపీఎస్ పథకంలో ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీ పీ ఎస్ ను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జగన్ సాహసోపేత నిర్ణయం అని శ్లాఘించారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ధైర్యం అందరికి ఉండదని,కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేశం యావత్తు ఔరా..అనదగ్గ రీతిలో సరైన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సీ పీ ఎస్ టెన్షన్ స్కీమ్ గా పరిణమించింది అని అభిప్రాయపడ్డారు.

ఉద్యోగుల కు పింఛను గ్యారంటీ అని భరోసా ఇచ్చి ఆర్థిక భద్రత భరోసా విషయం లో జగన్ మేలు మలుపు అటు రాష్ట్రాలకు, ఇటు ముఖ్యమంత్రులకు, దిశా నిర్దేశనం చేసేలా ఉందని అన్నారు.ఇటీవల నే హిమాచల్ ప్రదేశ్ కూడా పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ కు నిర్ణయం తీసుకోవడం,అలాగే..ఇపుడు ఆంధ్ర ప్రదేశ్ కూడా మడమ తిప్పని విధంగా ముందడుగు వేయడం.ఉద్యోగ వర్గాలకు పండగ అని హర్షం వ్యక్తం చేశారు.

మున్ముందు రాబోయే రోజుల్లో తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ కు నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని మాచన రఘునందన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply