Suryaa.co.in

Andhra Pradesh

తాను ఉండాలనుకుంటున్న విశాఖలోనే పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వవచ్చుకదా?

– పేదలపై జగన్ ది కపటప్రేమ. నిజంగా పేదలకు మంచేచేసే ఆలోచన జగన్ కు ఉంటే అహంకారం, అధికారమదంతో సర్వనాశనం చేసిన రాజధానిలో ఇళ్లస్థలాలు ఎందుకిచ్చాడు?
• రాజధానిలో పేదలకు ఇళ్లపట్టాలనే జగన్నాటకంలో అంతిమంగా నష్టపోయేది పేదలే.
• సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గతంలో పేదలకు ప్రభుత్వమిచ్చే ఇళ్లస్థలాలకు చట్టబద్ధత లేదనిచెప్పినా, ఆ స్థలాలు, నిర్మాణాలు ఎందుకూ పనికిరావని చెప్పినా జగన్ హడావిడిగా ఇళ్లనిర్మాణాలకు శంఖుస్థాపన చేయడం మోసంకాదా?
• రాజధాని రైతులకు అనుకూలంగా హైకోర్టులో తీర్పువచ్చిందన్న అక్కసుతో జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లాకే రైతులు తమపిటిషన్లు వేశారు.
• తన అవినీతికేసులు వాదించే పెద్దపెద్ద లాయర్లకు ప్రభుత్వసొమ్ముదోచి పెట్టడానికే జగన్ పేదలముసుగులో రాష్ట్రప్రభుత్వంతో సుప్రీంకోర్టులో తప్పుడు కేసులు వేయించాడు.
• కోర్టు తీర్పులు తనకువ్యతిరేకంగా వస్తాయన్న భయంతోనే జగన్ హడావిడిగా ఇళ్లనిర్మాణానికి తెరలేపాడు.
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

అమరావతిలో సెంటుపట్టాలు ఇవ్వడంపై, రాజధానికి భూములిచ్చిన రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే, ప్రభుత్వం స్వప్రయోజనాలకోసం పేదల్ని వంచిస్తూ, వారికిచ్చే సెంటుపట్టాలకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని, ఆ భూములపై వారికి ఎలాంటి హక్కు లు ఉండవని, ఏ హక్కులు అయినా తుదితీర్పునకు లోబడే ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే విస్పష్టంగా తీర్పు ఇచ్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు వక్ర భాష్యాలుచెబుతూ, జగన్మోహన్ రెడ్డి నేడు పేదలకు కట్టుకథలు చెప్పడం ఎంతవరకు సబబు అని నరేంద్ర మంగళగిరిలోని టీడీపీ జాతీయకార్యాలయంలో సోమవారం విలేకరుల సాక్షిగా ముఖ్యమంత్రిని నిలదీశారు.
నరేంద్ర విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయనమాటల్లోనే …

“ రాజధాని నిర్మాణానికి తాముభూములిస్తే, ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం న్యాయంచేయకుండా, తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తమభూము ల్లో ఇష్టానుసారం ఎలా నిర్మాణాలు చేస్తారని హైకోర్టుని ఆశ్రయించారు. రైతులవాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేస్తే, ముఖ్యమంత్రి హడావిడిగా పేదల ఇళ్లనిర్మాణం పేరుతో శంఖుస్థాపనలు చేయడం ఏమిటి? ఎవర్ని వంచించడానికి జగన్ ఈ ఇళ్లనిర్మాణ నాటకానికి తెరలేపాడు?

రాష్ట్రంలో ప్రజలు పలుసమస్యలతో ఇబ్బందు లు పడుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి వందలకోట్ల ప్రజాధనంతో ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు రాజధానిలో ఇళ్లిచ్చి పేదల్ని ఉద్ధరిస్తున్నట్టు నమ్మబలుకుతూ నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది?

అధికారంలోకి రాకముందు పేదలకు 30లక్షల ఇళ్లుకట్టిస్తానన్న జగన్, నాలుగేళ్లలో 7లక్షల ఇళ్లు కూడా కట్టకపోవడంపై ఏంసమాధానం చెబుతాడు? చంద్రబాబు పేదలకోసం నిర్మించిన 5వేల ఇళ్లను నాలుగేళ్లుగా పేదలకు ఇవ్వకుండా వారిని ఏడిపిస్తున్న జగన్ పేదల ఉద్ధారకుడా?

అమరావతి ప్రాంతలోని దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలు భూములు త్యాగం చేస్తేనే రాష్ట్రరాజధాని నిర్మాణానికి మార్గం సుగమమైంది. అలాంటి త్యాగధనుల్ని అవ హేళన చేస్తూ నేడు జగన్మోహన్ రెడ్డి సామాజిక రాజధాని అని ప్రకటించడం విడ్డూరం గా ఉంది. రాజధానిలో ఉన్న 32శాతం దళితులు, 14శాతం బీసీలు, 5 శాతమున్న మైనారిటీలు తరతరాలనుంచి అనుభవిస్తున్న భూములు ఇస్తేనే అమరావతికల సాకారమైంది.

దాన్ని విస్మరించిన జగన్ రెడ్డి, తన రంగులపిచ్చితో ప్రభుత్వ కార్య క్రమాల్ని, పార్టీ కార్యక్రమాల్ని ఒకేగాటన కట్టడం బాధాకరం. ప్రభుత్వభవనాలు, ప్రజల ఆస్తులపై తనపార్టీ రంగులేయడంపై గతంలో హైకోర్టు చీవాట్లు పెట్టినా జగన్ వైఖరిలో మార్పురాలేదు. అధికారంలోకి రాకముందు పేదలకు 30లక్షల ఇళ్లుకట్టిస్తానన్న జగన్, నాలుగేళ్లలో 7లక్షల ఇళ్లు కూడా కట్టకపోవడంపై ఏంసమాధానం చెబుతాడు?

సెంటుపట్టాల పంపిణీపేరుతో భూములుకొని, వందలకోట్లు కొట్టేసిన మీరు, మీ పార్టీ నేతలు పేదలపక్షపాతులు ఎలా అవుతారు? గతంలో పనిచేసిన ప్రభుత్వాలు ఏవైనా ప్రతి పేదవాడికి ఇంటినిర్మాణంకోసం 2 నుంచి3సెంట్లఇళ్లస్థలాలు ఇచ్చాయి. జగన్ ఒక్కడే వేలకోట్లు కొట్టేయడానికి సెంటుపట్టాల పేరుతో ఎందుకూపనికిరాని భూముల్ని పేదలకు అంటగట్టాడు. అమరావతి ప్రాంతంలో టీడీపీప్రభుత్వం పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్లను నాలుగేళ్లుదాటినా జగన్ ఎందుకు వారికి ఇవ్వలేదు?

జగన్ అధికారంలో కి వచ్చిన వెంటనే ఆ ఇళ్లను పేదలకు ఇచ్చినట్టయితే, 5వేల కుటుంబాలు సంతోషంగా ఉండేవి. నాఎస్సీలు, నాఎస్టీలు, నా బీసీలు అని ఉత్తుత్తిజపాలు చేయడం తప్ప జగన్ నిజంగా పేదలకు న్యాయంచేసే మనిషికాదని అతనిచర్యలతోనే తేలిపోయింది. పేదల కోసం గతప్రభుత్వం కట్టించిన ఇళ్లు ఇవ్వకుండా, తాను కట్టిస్తానన్న 30లక్షల ఇళ్లు నిర్మించకుండా నాలుగేళ్లుగా పేదల్ని వంచించిన జగన్ పేదలపక్షపాతినని చెప్పుకోవ డం పచ్చి బూటకం.

పేదలకు ఎవరు ఎలాంటి ఇళ్లుకట్టించారో తెలుసుకోవడానికి రాజ ధానిలో గతంలో చంద్రబాబుకట్టించిన ఇళ్లు, నాలుగేళ్లలో జగన్ కట్టించిన ఇళ్లే నిదర్శ నం. (ఆయా ఇళ్లకు సంబంధించిన ఫోటోలను నరేంద్ర విలేకరులకు ప్రదర్శించారు). సెంటుస్థలంలో ఒక కుటుంబం ఎలా నివసిస్తుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. చంద్రబాబు అన్నివసతులతో పేదలకోసం కట్టించిన టిడ్కోఇళ్లమాదిరే, నాలుగేళ్లలో జగన్ ఎందుకు నిర్మించలేదో ఆయనే సమాధానం చెప్పాలి.

తన అవినీతికేసుల్ని వాదిస్తున్న లాయర్లకు ప్రజలసొమ్ము దోచిపెట్టడానికే జగన్ రెడ్డి, హైకోర్టు ఇచ్చిన విష్పష్టతీర్పుపై కావాలనే సుప్రీంకోర్టుకు వెళ్లాడు.

4 సంవత్సరాల 3నెలలు తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోయిన జగన్ కు ఉన్నపళంగా పేదలజీవితాలు గుర్తుకురావడం విడ్డూరంగా ఉంది. ఎన్నికలకు కేవలం 6, 7 నెలలే ఉన్నందున ఒకేసారి రాత్రికి రాత్రి పేదల్ని ఉద్ధరించినట్టు కట్టుకథలు చెబుతున్నాడు. పేదల్ని తాను ఎలా ఉద్ధరించాడో కూడా జగన్ చెబితే బాగుండేది. ప్రజలకోసం, రాష్ట్రం కోసం గతప్రభుత్వం నిర్మించతలపెట్టిన అమరావతి నిర్మాణాన్ని నాశనం చేయ డమే నా జగన్ ఉద్ధరణ?

రాజధానికి భూములిచ్చిన రైతుల్ని రోడ్డునపడేసి, వారి జీవి తాల తో ఆటలాడటమేనా ఉద్ధరణ? రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందంప్రకారం ప్రభుత్వం వ్యవహరించాల్సిందేనన్న హైకోర్టు తీర్పుని తుంగలోతొక్కి, ప్రజారాజధానిని వివాదాల రాజధానిగా మార్చింది జగన్ రెడ్డికాదా? హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్, రైతులు కూడా సుప్రీంకోర్టు గడపతొక్కేలా చేశాడు.

అదే జగన్ ఇప్పుడు కోర్టులో తప్పుడు కేసులువేశారని నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులువాదించే న్యాయవాదులకు న్యాయంచేయడానికి జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడుతప్ప, నిజంగా పేదలపై ప్రేమ తో కాదు. సుప్రీంకోర్టులో జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసులు వాదించే లాయర్లు నిరం జన్ రెడ్డి, ముకుల్ రోహిత్గీ, వైద్యనాథన్ లాంటివారికే హైకోర్టు ఇచ్చిన విస్పష్టమైన తీర్పుపై సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఇవ్వడం పేదలకోసమా.. లేక వారిని బాగు చేయడం కోసమో జగన్ రెడ్డే చెప్పాలి.

తాను వ్యక్తిగతంగా చెల్లించాల్సిన సొమ్ముని పేదల తరుపున వాదిస్తున్నట్టు నమ్మించి, ప్రభుత్వసొమ్ముని వారికిచెల్లించడం జగన్ పేదల్ని ఉద్ధరించడం అవుతుందా? ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు అమలు కావ డంలేదని రాజధాని రైతులు సుప్రీంకోర్టుకువెళితే, రాష్ట్రప్రభుత్వం వారికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం, ముమ్మాటికీ జగన్ కేసులువాదించే లాయర్లను బతికించడానికే.

బాగుచేయలేని విధంగా అమరావతిని సర్వనాశనంచేసిన జగన్, ఆప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడం వారికి అన్యాయంచేయడం కాదా? రాష్ట్రరాజధానిగా అమరావతే ఉంటుందని ప్రకటించే దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నాయా?

రాజధానిలో ఇన్నివేలమందికి సెంటుపట్టాలిచ్చిన జగన్ రెడ్డి, అమరావతే రాజధాని అదిఎప్పటికీ మారదని ప్రకటించే దమ్ము, ధైర్యం ఉన్నాయా? మనందరి అమరావతి అనే జగన్ మాట ఉత్తుత్తిమాటేనా… లేక అవసరాలు, అవకాశాల్ని బట్టి మారుతుందా ? ఎక్కడెక్కడివారికో అమరాతిలో ఇళ్లపట్టాలిస్తున్న జగన్ తానుమాత్రం విశాఖకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఏప్రభుత్వాలు వచ్చినా బాగుచేయలేని విధంగా అమ రావతిని సర్వనాశనంచేసిన జగన్, ఆప్రాంతంలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం ముమ్మాటికీ వారికి అన్యాయంచేయడమే.

అమరావతి ఎడారని, శ్మశానమని ప్రచారం చేసిన జగన్, ఇప్పుడు తాను పేదలకు ఇస్తున్న సెంటుపట్టా విలువ రూ.7లక్షలు ఎలాఅవుతుందో సమాధానంచెప్పాలి. రాష్ట్రరాజధాని అమరావతేఅని జగన్ ప్రకటిస్తే, పేదలఇంటిస్థలం విలువ 7లక్షలుకాదు..దానికి మూడింతలు పెరుగుతుంది. పేదలపై జగన్ చూపుతున్న ప్రేమ అంతా ఉత్త కపటనాటకమే. మాటల్లోతప్ప, చేతల్లోచూపని ప్రేమ నిజమైన ప్రేమకాదని పేదలంతా తెలుసుకోవాలి. జగన్ కు నిజంగ ప్రేమే ఉంటే రాజధానిలో పేదలకు కడతానంటున్న 50వేలఇళ్లు పోలవరం నిర్వాసితులకు నిర్మిస్తే, ప్రాజెక్ట్ పూర్తవుతుందికదా!

అవసరమున్నచోట చేయకుండా, అవసరంలేని చోట హడావిడిచేసి ప్రజల్ని నమ్మించేప్రయత్నాలుచేస్తే బొక్కబోర్లా పడటంఖాయం. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన సమయంలో హడావిడిగా వర్షాలుపడేసమయంలో, బురదలో ప్రజలకు ఇంటిస్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజధనాన్ని తనవ్యక్తిగత అవసరాలకోసం విలాస వంతంగా ఖర్చుచేయడంలో జగన్ ను మించినవారులేరు.

భవిష్యత్ లో కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే, అమరావతిలో ఇటుకకూడా కదపలేనన్న భయంతోనే జగన్ తూతూమంత్రంగా హడావిడిగా ఇళ్లనిర్మాణానికి తెరలేపాడు. మంత్రి జోగిరమేశ్ తన శాఖలో జరిగేవాటిపై మాట్లాడితే బాగుంటుంది. 30లక్షల ఇళ్లుఎప్పుడునిర్మించి, పేద లకు ఇస్తున్నారో జోగిరమేశ్ సమాధానంచెప్పాలి. అధికారం, అహంకారం తలకెక్కే రమేశ్ ఆఖరికి టోల్ గేట్ సిబ్బందికూడా తనకు వంగివంగి నమస్కారం పెట్టాలంటు న్నాడు.” అని నరేంద్ర స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE