కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కేసులు నమోదు చేయాలి

– సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కేసులు నమోదు చేయాలని… హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నా కేసు నమోదు చేయలేదంటూ బిజెపి కార్పొరేటర్లు రాష్ట్ర డీజీపీ ను కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లను దూషించారంటూ చేసిన ఫిర్యాదు పై ఏ చర్యలు తీసుకున్నారని డీజీపీ ను కోరినట్లు తెలిపారు. తాను సోషల్ మీడియాలో ట్విట్టర్ టిల్లు అని వ్యాఖ్యలు పై పోలీసులు అత్యుత్సాహం తన పై కేసును నమోదు చేశారని…తాను డీజే టిల్లు అని కేటిఆర్ ను ఉద్దేశించి అనలేదని సరూర్ నగర్ బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీ వాణి అన్నారు.

కానీ కేసీఆర్ , కేటిఆర్ లు మాట్లాడిన మాటలను ఆధారాలను సైబర్ క్రైమ్ ఏసీపీకి అందజేసిన ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మీడియా ముఖంగా దేశ ప్రధాని, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేయకపోతే… వారు మాట్లాడిన భాషపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు.

Leave a Reply