– సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి: పిసిసి అధ్యక్షుడిగా మొదటి సారి సంగారెడ్డి కి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కి స్వాగతం. రాష్ట్రంలో గతంలో నిరంకుశ పాలన కొనసాగింది. తెలంగాణా పోరాటాన్ని గౌరవించి మంచి నిర్ణయం తీసుకుని తెలంగాణ ను ఇచ్చింది సోనియా గాంధీ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను వరుసగా అమలుచేస్తుంది. పేదలకు భూములను పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
ప్రతి కుటుంబానికి గృహాన్ని ఇచ్చే పనిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను జనంలోకి తీసుకు వెళ్ళాలి ,వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలి. దేశంలో కుల గణన జరగాలన్నది రాహూల్ గాంధీ కల. ఇప్పుడు తెలంగాణ లో కుల గణన విజయవంతంగా జరుగుతోంది.
రేవంతరెడ్డి సామాజిక న్యాయం కోసమే కులగణన జరుపుతున్నారు. యాభై నాలుగువేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. అందరికీ ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. ప్రతి పేదవానికి గృహాన్ని అందిస్తాం. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను జనంలోకి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ల తో పాటు జిల్లా చెందిన శాసనసభ్యులు , పార్టీ సీనియర్ కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొన్నారు.