Home » National

నీట్ పేపర్ లీక్ కాలేదు

-రెండుచోట్ల అవకతవకలు -కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు. రెండు పరీక్ష కేంద్రాల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుప్రీం ఆదేశాల మేరకు 1563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Read More

లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి

– కేంద్రం ఆదేశం ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది. తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియకముందే వెళ్లిపోవడాన్ని ఉపేక్షించరాదని పేర్కొంది. చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించామంది. ఆలస్యంగా వచ్చిన, ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలంది. తగిన కారణాలుంటే నెలలో రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొచ్చని తెలిపింది.

Read More

కీలక విషయాల్లో భారత్‌ తో కలిసి పనిచేస్తాం

కెనడా ప్రధాని జస్టిన్‌ జస్టిన్‌ ట్రూడో భారత్‌-కెనడా సంబంధాలు నామమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రధానులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్‌ జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ.. ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి తాను వెళ్లడం లేదని తెలిపారు.

Read More

రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి భోపాల్‌కు రైలులో ప్రయాణించారు. తన భార్యతో కలిసి ఢిల్లీ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన రైలు లోని ప్రయాణికులతో మాట్లాడారు. చిన్నారులను ఎత్తుకుని ఆడించారు. భారతీయ రైల్వే లలో విప్లవాత్మక మార్పులకు కారణం వీరే అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ లను ప్రశంసించారు.

Read More

కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు

– కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి న్యూఢిల్లీ: మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ‘భారతీయ న్యాయ్ సంహిత’, ‘భారతీయ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అభినయం’ ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ తెలిపారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ లలో మార్పు జరిగిందని, తగిన సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా మూడు చట్టాల్లోనూ మార్పులు…

Read More

చీనాబ్ రైల్వే బ్రిడ్జీపై ట్రయల్ రన్ విజయవంతం

జమ్మూలోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ వంతెనపై నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ట్రైన్ ఇంజన్ ను టెస్ట్ చేయగా విజయవంతంగా అది రియాసి స్టేషన్ కు చేరుకుందని తెలిపారు. దీంతో త్వరలోనే రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసి మధ్య త్వరలో సేవలు ప్రారంభం కానున్నాయి.

Read More

బక్రీద్ ఖుర్బాని బీదలపాలిట మహాదానం

– రుస్తుం అంతర్జాతీయ చిత్రకారులు బక్రీద్ పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు ఆదివారం “బక్రీద్ ఖుర్భాని ముబారక్” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను కళావంతం చేస్తాయి. బక్రీద్ ఈదుల్ జుహ పర్వదినం త్యాగానికి సహనానికి ప్రతీక అనీ పండుగ నాడు ధనవంతులు తమకు కల్గిన సంపదలో బీదలకు రెండున్నర శాతం వస్తురూపేన పంచి అల్లా కృపకు పాత్రులు కావాలని అల్ ఖురాన్ భోదిస్తుందని పండుగ…

Read More

వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ నిధులు

రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 18న రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు.

Read More

కేజ్రీవాల్ భార్యకు కోర్టు నోటీసు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టుకు హాజరైనప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సూచించింది. దీనిపై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మలతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. కేజ్రీవాల్ గతంలో రౌస్ అవెన్యూ కోర్టులో చేసిన ప్రసంగం కాసేపటికే సోషల్ మీడియాలో కనిపించింది.

Read More

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్

దేశవ్యాప్తంగా ఆదివారం UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాలి.

Read More