Suryaa.co.in

National

ఫాల్కే అవార్డును ముగ్గురికి అంకితం చేసిన రజనీకాంత్

ఢిల్లీలో నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేశారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రఖ్యాత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రదానం చేశారు. దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఆయన చిత్రసీమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఉపరాష్ట్రపతి…

భారత్‌-చైనా మధ్య అనుమానాలే అడ్డంకి: బిపిన్‌ రావత్‌

గువాహటి: భారత్‌-చైనా మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్‌, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2020లో ఇరుదేశాల మధ్య…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం(డీఏ)ను 3శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు జులై 2021 నుంచే అమలవుతుందని…

పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో కేంద్రం

– ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం చుక్కలనంటుతోన్న పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో పడిందా..? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అసలు పెట్రోల్ ధరలు తగ్గేనా? అనే ఆలోచనల్లోకి వెళితే, పెరగడమే కాని తగ్గడం…

భార‌త సైనికుల‌కు స‌రికొత్త ఆయుధాలు…

ల‌ద్దాఖ్‌లోని గ‌ల్వాన్ ఘ‌ట‌న త‌రువాత భార‌త ప్ర‌భుత్వం సైనికుల కోసం అధునాత‌న‌మైన ఆయుధాల‌ను స‌మ‌కూర్చ‌డం మొద‌లు పెట్టింది. ఇండియా చైనా బోర్డ‌ర్లో ఇరు దేశాల సైనికులు ఆయుధాల‌తో ప‌హ‌రా నిర్వ‌హించ‌కూడ‌దు అనే ఒప్పందం ఉన్న‌ది. అయితే, ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచి ఈటెలు, ముళ్ల వంటి ఆయుధాల‌తో గ‌ల్వాన్‌లో భార‌త్ సైనికుల‌పై దాడి చేసింది….

భారత్ ను గొప్పగా నిర్మించడమే మా లక్ష్యం: అమిత్‌షా

‘‘అధికారం కోసం వచ్చిన వ్యక్తులము కాదు.భారత్ ను గొప్పగా నిర్మించడమే మాలక్ష్యం. మహాన్ భారత్ ను నిర్మించే లక్ష్యంతో మా పార్టీ స్థాపించబడింది. అధికారం కోసం రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులము కాదు‘‘ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అండమాన్ నికోబర్ లో బిజెపి కార్యకర్తలు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశం లో…

ఆకలి భారతం!

– గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 101వ స్థానం – దిగజారిన ఇండియా ర్యాంక్‌ – మనకన్నా పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు ఉత్తమ ర్యాంక్‌ దేశంలో ఆకలి ఘోష తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతూ, లక్షల కోట్లు కార్పొరేట్లకు కట్టబెట్టే మోడీ ప్రభుత్వ హయాంలో ఆకలి సూచీలో మనదేశ స్థానం దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా…

ఉగ్రవేటకు ‘కార్గో’ రెడీ..!

– మళ్లీ సిద్ధమైన స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ జమ్ము కశ్మీర్‌లో పండితులతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)ను మళ్లీ సిద్ధం చేసింది. జమ్ము కశ్మీర్‌ పోలీసుల్లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారితో దీనిని ఏర్పాటు చేశారు. దీని…

మ‌ణిపూర్‌లో ఉగ్ర‌వాదుల కాల్పులు…

దేశంలో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. జ‌మ్మూకాశ్మీర్‌లో గ‌త కొన్ని రోజులుగా ఉగ్ర‌వాదులు పంజా విసురుతున్నారు. గ‌తంలో సైనికుల‌ను టార్గెట్ చేసుకొని దాడులు జ‌రిపే ఉగ్ర‌వాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్ల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మ‌ణిపూర్‌లోనూ ఉగ్ర‌వాదులు మార‌ణ‌హోమం సృష్టిస్తున్నారు. మ‌ణిపూర్‌లోని…

దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం!

దేశానికి విద్యుత్ సంక్షోభం ముప్పు ముంచుకొస్తోంది. బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఆ బొగ్గు కొరత వెంటాడుతోంది. చాలా విద్యుత్ కేంద్రాల్లో బఫర్ స్టోరేజీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఒక్కటి రెండ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి, సరఫరాలోనూ సమస్యలు ఉన్న నేపథ్యంలో దేశంలో…