-సీబీఐ,ఐటీ,ఈడీ బీజేపీ జేబు సంస్థలు
-రేవంత్ కమిషన్లకు బ్రాండ్ అంబాసిడర్
-గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదు
-కర్ణాటక ప్రజలు చీ కొట్టినా బీజేపీ కి బుద్ది రాలేదు
-గ్రామాలకు వెళ్లి 111 జీ వో కొనసాగాలని చెప్పే ధైర్యం కాంగ్రెస్ బీజేపీ లకు ఉందా?
-బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కె. పి వివేకానంద
అవుటర్ రింగ్ రోడ్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్-బీజేపీ శరపరంపరగా చేస్తున్న ఆరోపణలపై, బీఆర్‌ఎస్ ఎదురుదాడికి దిగింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని కొట్టిపారేసింది. అసలు పదిశాతం నిబంధనే లేదని తేల్చింది. అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్న కేసీఆర్ సర్కారుపై, లేనిపోని అభాండాలు మోపి దుమ్మెత్తిపోస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కె. పి వివేకానంద మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే డి. సుధీర్ రెడ్డి ఏమన్నారంటే..
రేవంత్ రెడ్డి కి అభివృద్ధి రుచించదు.ఔటర్ రింగ్ రోడ్డు లీజు పై విషం చిమ్ముతున్నారు.నిబంధనల ప్రజారమే irb సంస్థ కు లీజు దక్కింది.irb కి టెండర్ల తర్వాత లెటర్ ఆఫ్ ఆక్సిప్టెన్స్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి నిబంధనలను తప్పుగా ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. irb సంస్థ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తుంది.
పది శాతం డబ్బు ముందు చెల్లించాలని రేవంత్ అనడం శుద్ధ తప్పు.అలాంటి నిబంధన ఏదీ లేదు.భాద్యతా యుతమైన ఎంపీ స్థానం లో ఉండి రేవంత్ ఇలా ఆరోపణలు చేయడం సమంజసం కాదు.బురద జల్లడం రేవంత్ కు అలవాటు గా మారింది.ఇక ముందు అలాంటివి మాను కోవాలి. అభివృద్ధి ని అడ్డుకోవడం రేవంత్ నైజం.
కర్ణాటక ప్రజలు చీ కొట్టినా బీజేపీ కి బుద్ది రాలేదు. బీజేపీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు పై అసత్యపు ఆరోపణలు చేస్తోంది.40 శాతం కమిషన్ ఆరోపణలతో కర్ణాటక లో బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. రేవంత్, రఘునందన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి. సీబీఐ,ఐటీ,ఈడీ మోడీ త్రివిధ దళాలు గా మారాయి. 40 శాతం కమిషన్ అని కాంగ్రెస్ కర్ణాటక లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించింది. ఇక్కడ 30 శాతం కమిషన్ అని మా మీద ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ కు వర్కవుట్ కాదు.
ఇక్కడ ఉన్నది బీ ఆర్ ఎస్ ప్రభుత్వం .కాంగ్రెస్ పప్పులు ఉడకవు. రేవంత్ కమిషన్లకు బ్రాండ్ అంబాసిడర్. గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదు. ఆమె కు దేవుడు మంచి బుద్ది ప్రసాదించాలి. కొత్త పార్లమెంటు ప్రారంభానికి బీ ఆర్ ఎస్ హాజరు పై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటారు. ఔటర్ లీజు పై ప్రజలను తప్పు దోవ పట్టించిన రేవంత్ రఘు నందన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. సీబీఐ,ఐటీ,ఈడీ బీజేపీ జేబు సంస్థలు.
ఎమ్మెల్యే కె. పి. వివేకానంద సుధీర్ రెడ్డి ఏమన్నారంటే..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి మతి భ్రమించింది. పచ్చ కామెర్ల వాడికి లోక మంతా పచ్చగా కనిపిస్తుంది ..అలాగే రేవంత్ రెడ్డి కి అన్నిటిలో పచ్చ నోట్లే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ తీరు ను తప్పు బడుతున్నారు. ktr విదేశీ పర్యటన పై అనుచిత వ్యాఖ్యల పై రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. కోడి గుడ్డు మీద ఈకలు పీకడమే రేవంత్ సంస్కృతి.
పీసీసీ అధ్యక్ష పదవి ని నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారు. ktr రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే తెర వెనుక ఒప్పందం అంటాడా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కి బీ ఆర్ ఎస్ కార్యకర్తలు తగిన జవాబు చెబుతారు.ktr విదేశీ పర్యటనల ద్వారా ప్రముఖ సంస్థలు వేల కోట్ల పెట్టుబడులు రావడం లేదా?
ఐటీ ఎగుమతులు రెట్టింపు కావడం ktr ఘనత కాదా?బెంగళూరు కు గుర్గావ్ కు వెళ్లిపోవాల్సిన దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు రప్పిస్తున్న ఘనత ktr దే. అన్ని రంగాల పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయి. లక్షలాది మంది కి ఉపాధి దక్కడం రేవంత్ రెడ్డి కి ఇష్టం లేదు.తెలంగాణ బాగుపడటాన్ని రేవంత్ రెడ్డి కళ్ళు చూడలేక పోతున్నాయి.
వచ్చే ప్రభుత్వం బీ ఆర్ ఎస్ దేనని నిర్ణయం అయిపోయింది. అందుకే ktr ను అప్రతిష్ట పాలు చేసేందుకు రేవంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ ఇప్పటిదాకా చేసిన ఏ ఆరోపణలకు కూడా ఆధారాలు లేవు. గాలి పోగేసి మాట్లాడటం రేవంత్ కు అలవాటుగా మారింది. రేవంత్ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే.
111 జిఓ పై కాంగ్రెస్ బీజేపీ లు రాద్ధాంతం చేస్తున్నాయి. జీవో రద్దు చేయాలని 84 గ్రామాల ప్రజలు తీర్మానించారు.ఆ గ్రామాలకు వెళ్లి 111 జీ వో కొనసాగాలని చెప్పే ధైర్యం కాంగ్రెస్ బీజేపీ లకు ఉందా?అన్నీ ఆలోచించే ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు 111 జీ వో ను రద్దు చేసింది.