-కియా అనుబంధసంస్థల వద్ద నారా లోకేష్ సెల్ఫీ ఆనందం
కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు..థిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. చంద్రబాబు దునియా మొత్తం చూసేశారు. ఆ దూరదృష్టి నుంచి వచ్చే ఆలోచనలను ఆచరణలో పెడతారు కాబట్టే ఆయనని దార్శనికుడు అని అంటారు. చంద్రబాబు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కియాని తీసుకొచ్చినప్పుడు, కమీషన్ల కోసం తెచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. కార్లు అమ్ముడుపోని కంపెనీని తెచ్చి ఏం చేస్తారని హేళన చేశారు. అనతికాలంలోనే కియాలో తయారైన కార్లు దేశమంతా దూసుకుపోతున్నాయి. కియా అనుబంధసంస్థలు వేలసంఖ్యలో యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. థిమాక్ ఉన్న చంద్రబాబు దునియా చూసి తెచ్చిన కియా కంపెనీ ఫలాలు రాష్ట్రానికి అందుతున్నాయి.
కియాని విమర్శించిన వైసీపీ నోర్లే, కియా తమ మహామేత లేఖ రాయడం వల్ల వచ్చిందని ఓ ఫేక్ ఉత్తరం సృష్టించి అసెంబ్లీలో చదివి అల్పసంతోషం మిగుల్చుకున్నారు. కానీ కియా తెచ్చింది చంద్రబాబు అని, టిడిపి ప్రభుత్వ హయాంలో వచ్చిందని అందరికీ తెలుసు. టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని పాలసముద్రం పంచాయతీలో ఉన్న కియా అనుబంధ సంస్థల మీదుగా సాగింది. వందలాది ఉద్యోగులు తనకి ఎదురుపడటంతో వారితో మాట్లాడిన లోకేష్ తమ కష్టానికి తగిన ప్రతిఫలం యువతకి ఉద్యోగ ఉపాధి రూపంలో దొరికిందని ఆనందంతో ఉప్పొంగిపోయారు. కియా అనుబంధ సంస్థలలో ఉద్యోగం చేస్తున్న పద్మావతి అనే సోదరి లోకేష్‌తో పాటు కొద్దిదూరంలో పాదయాత్రలో నడిచింది. తమకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించిన కియా తీసుకొచ్చినందుకు చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేసింది.