Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలకు చట్ట సభలంటే లెక్కలేదు

త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది
-కౌరవ సభను గౌరవ సభగా మారుస్తాం
– టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాజంనేయస్వామి

ఐదు కోట్లమంది ప్రజలకు దేవాలయం లాంటి చట్టసభలను సీఎం జగన్ రెడ్డి వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు అగౌరవపరిచారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన 15 వ శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా, సమర్దవంగా నిర్వహించలేకపోయారు. మొదటి అసెంబ్లీ సమావేశాల నుంచి నేడు ముగిసిన చివరి సమావేశాల వరకు శాసనసభలో అనేక చీకటి అంశాలు చోటు చేసుకున్నాయి.

గవర్నర్ ప్రసంగం ఆలస్యంగా ప్రారంభం అయింది, శాసనసభలో చేసిన చట్టాలు అమలు కాలేదు. ( ఉదా: 3 రాజధానులు దిశ) శాసనసభ స్పీకర్ ప్రతిపక్ష సభ్యులపై అసభ్య పదజాలం ఉపయోగించారు. వైసీపీ సభ్యులు సభలో లేని ఉన్నతమైన మహిళల గురించి అసభ్యంగా మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ని అవమానించారు.

ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వలేదు. ప్రతిపక్ష సభ్యులపై సభలోనే దాడులు చేశారు. కోరం లేక సభను సమయానికి ప్రారంభించలేదు. అధికారపక్ష సభ్యులు సినిమా చూడటం కోసం సభను వాయిదా వేయడం సిగ్గుచేటు. 15వ శాసనసభ 5 సంవత్సరాలలో 78 రోజులు మాత్రమే నిర్వహించారు. ప్రతిపక్ష సభ్యులను 26 సార్లు సభ నుండి సస్పెండ్ చేశారు.

సభలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండానే బడ్జెట్ కాపీలు బయటకు ఎలా వస్తాయి? శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేయడం- దాన్ని అమలు చేయకపోవడం. చివరి సమావేశాల్లో గ్రూప్ పోటో తీసుకోకపోవడం. ఇలా 15 శాసనసభలోనే జరిగిన చీకటి అంశాలు అనేకం. నేటితో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలింది. మరో రెండు నెలల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుంది. కౌరవ సభను గౌరవ సభగా మార్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. ప్రజారంజక పాలన అందిస్తాం.

LEAVE A RESPONSE