Suryaa.co.in

Andhra Pradesh

తప్పుడు లేఖతో ప్రచారం చేస్తున్న సజ్జల భాస్కర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి

– నదిలో కొట్టుకుపోయే వాడు ఒడ్డున పడటానికి ప్రయత్నం చేసేలా ఉంది జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు మీద వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్న లేఖ ఫేక్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేసారు. ఫేక్‌ లేఖతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు సీఐడి అడిషనల్ డీజి సంజయ్ అందుబాటులో ఉండటం లేదని ఆయన మండిపడ్డారు.

టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ… “జగన్ మోహన్ రెడ్డికి తన ప్రభుత్వం త్వరలో అంతం కాబోతుందని తలకెక్కింది. అందుకే వికృత చేష్టలతో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులను ఆత్మోన్యతకు గురిచేసి లబ్దీ పొందాలని చూస్తున్నాడు. అందులో భాగమే నిన్న చంద్రబాబు గారి పేరుతో సజ్జల రామకృష్ట రెడ్డి కుమార రత్నం సజ్జల భార్గవ్ రెడ్డి విడుదల చేసిన లేఖ. అందులో అంతా చెత్త రాసి చివరన చంద్రబాబు సంతకం పెట్టారు. తెలుగుదేశం పార్టీపై విషం కక్కటానికి తెలుగుదేశం శ్రేణులను పక్కద్రోవ పట్టించడానికి జగుత్సాకరంగా లేఖను రాసి ప్రచారం చేస్తున్నారు.

ప్రజలు ఎవ్వరు కూడా ఈ లేఖను నమ్మలేదు. ప్రజల్లో కులమత, వర్గం భేదాలు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు గారు పని చేయటమే అందుకు కారణం. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై దృష్టి పెట్టాము.. సీఎం ఫ్యామిలీ, మంత్రులు, ఆకరికి ప్రతిపక్షాలు మీద అయినా తప్పుడు పోస్టులు పెడితే ఊరుకోము అని పవరుఫుల్ పోలీస్ లాగా మాట్లాడిన సీఐడి చీఫ్ సంజయ్ సెలవివ్వటంతో నాకు ధైర్యం వచ్చింది. అందుకే మేము ఈ లేఖపై కంప్లైంట్ ఇద్దామని అపాయింట్ మెంట్ కోసం సంజయ్ కి వాట్సాప్ మెసేజ్ చేసాను, వారి కార్యాలయానికి మెసేజ్ చేసాను కానీ ఎటువంటి స్పందనా లేదు.

దాంతో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ అంతా అబద్ధాల పుట్ట అని తేలిపోయింది. ఇక కంప్లైంట్ ను మెయిల్ చేసాను కాబట్టి భార్గవ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోండి. ఇవే కాకుండా మా నాయకుడు అచ్చెన్నాయుడి పేరు మీద కూడా లేఖలు విడుదల చేశారు. మా మహిళా నాయకురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ అనురాధ మీద అనుచిత పోస్టులు పెట్టారు. నిజంగా మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ చిత్తసుద్ధితో పెట్టిందే అయితే మీకు ధైర్యం ఉంటే అరెస్టులు చేయండి.

టీడీపీ మీదే కాకుండా హైకోర్ట్ మీద కూడ అనుచిత పోస్టులు పెట్టిన పంచ్ ప్రభాకర్ ను ఏం చేశారు? అధికార పార్టీకే మేము దాసోహం చేస్తాము అనుకోకుండా ఫేక్ లేఖను విడుదల చేసిన భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయాలి” అని సీఐడి అడిషనల్ డీజి సంజయ్ కు తెలియజేసారు.

LEAVE A RESPONSE