Home » ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానిని కోరారు. సరైన సమాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ జనగణన కోసం టీడీపీ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. ఇప్పుడున్న కులాల వారీ వివరాలు 90 ఏళ్ల నాటివని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply