Suryaa.co.in

Andhra Pradesh

జగన్ అవినీతి పై కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం కాదు .. చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలి?

-చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

వైసీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. సీఎం జగన్ అంత అవినీతి పరుడు దేశంలో ఎవరూ లేరని సాక్ష్యాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సీఎం అవినీతిపై కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం కాదు జగన్ పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలి?

కుప్పంలో గ్రానైట్ డోపిడి చేస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా…ఖబడ్దార్. రెండు వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారు. టీడీపీ మిని మేనిఫెస్టోలో మహిళ, యువత, రైతులకు అందరికీ న్యాయం చేసేలా పధకాలు రూపొందించాం.సందప సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయంతో పేదలకు సంక్షేమ పధకాలు ఇస్తాం
ఈ సంక్షేమ పధకాల్ని కుప్పం నుంచే ప్రారంభిస్తా.మైనార్టీకు జగన్ ప్రత్యేకంగా పధకాలు తీసుకురాకపోగా రంజాన్ తోఫా వంటి పధకాలు రద్దు చేశారు. 35 ఏళ్లు ఎమ్మెల్యే, 14 ఏళ్లు సీఎం, 13 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న నాకు ఇళ్లు కట్టుకోవడానికి అనుమతివ్వడంట ఈ తుగ్లక్.

రాష్ట్రం జగన్ తాత జాగీరా ? రాష్ట్రాన్ని రౌడీలకు నిలయంగా మార్చారు. ప్రశాంతమైన కుప్పంలో రౌడీలతో బెదిరిస్తున్నారు. రౌడీలను అణిచివేసే భాద్యత నాది. అన్ని లెక్కపెడుతున్నా…వడ్డీతో సహా చెల్లిస్తాం…తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన వారిని వదిలేది లేదు.

 

LEAVE A RESPONSE