వైసీపీలోని దళితులు బానిసల్లా బ్రతుకీడ్చుతున్నారు

Spread the love

మాదిగ జాతికి అన్యాయం చేసిన జగన్ రెడ్డికి భజన చేయడానికి సిగ్గనిపించటం లేదా?

ఆదిమూలపు సురేష్, నందిగం సురేష్, తానేటి వనితలు లు నోరు అదుపులో పెట్టుకోవాలి

– మాజీ మంత్రి కె. ఎస్ జవహర్

మంత్రి ఆదిమూలపు సురేష్ తండ్రి గుర్రంపై తిరిగి దళితుల గౌరవాన్ని పెంచితే.. ఆయన కుమారుడైన సురేష్ మాత్రం పదవి కోసం జగన్ దగ్గర బానిసగా మారి చొక్కా విప్పి దళిత జాతి పరువు తీశారు. వైసీపీలోని దళితులు బానిసలుగా బ్రతుకీడ్చుతున్నారు, వారిని చూస్తూ జాలితో కూడిన బాదేస్తోంది. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి.

ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపినపుడు మీ దళిత పౌరుషం ఏమైంది? పదవుల కోసం జాతిని తాకట్టు పెట్టిన వారు జాతి గురించి మాట్లాడితే నవ్వొస్తోంది. దళిత రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి సిగ్గులేకుండా రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చామంటారా? జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో దళితుల్ని బిచ్చగాళ్లలా మార్చారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మలుపు పధకం ద్వారా మాదిగల అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ముందడుగు పథకం తెచ్చి మాదిగలకు 2 ఎకరాలు భూమి, తో పాటు రెండు పాడి గేదెలు ఇచ్చి వారిని అభివృద్ది పధంలో నడిపించిన ఘనత టీడీపీదే. చంద్రబాబు చేసిన వర్గీకరణ వల్ల గ్రూప్ 1 ఉద్యోగులుగా ఉన్న మాదిగలకు కన్పాడ్ కలెక్టర్లుగా అవకాశం దక్కింది. ఉపాధ్యాయ, అనేక ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో పూర్తి న్యాయం జరిగింది.

కానీ వర్గీకరణ చేయను అని చెప్పిన జగన్ కి భజన బ్రుందంగా మారి ఆదిమాలపు సురేష్, నందిగం సురేష్, తానేటి వనితలు భజన చేయటం సిగ్గుచేటు. టీడీపీ హయాంలో జీవో 25 తెచ్చి మాదిగలకు న్యాయం చేశాం, కానీ నేడు ఈ జోవోను జగన్ రెడ్డి తుంగలో తొక్కి మాదిగలకు అన్యాయం చేశారు.

దేశంలో మొట్టమొదటి సారి చర్మకారులకు, డప్పు కళాకారులకు ఫించన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశానిదే. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అదనంగా ఒక్క ఫించన్ అయినా ఇచ్చారా? టీడీపీ హయాంలో నెల్లూరు, దుర్గి ప్రాంతాల్లో లిడ్ క్యాప్ కి భూములు కేటాయిస్తే…జగన్ రెడ్డి ఆ భూముల్ని ఇళ్ల పట్టాల పేరుతో పలహారం చేశారు తప్ప మాదిగలకు ఆయన ఏం చేసిందేంటి?

లిడ్ క్యాప్ ద్వారా సాంకేతిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి లెదర్ వస్తువుల ఉత్పత్తిలో మాదిగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాం. కానీ నేడు లిడ్ క్యాప్ జగన్ రెడ్డి నిర్వీర్వం చేశారు. రోడ్ల వెంట చెప్పులు కుట్టేవారికి ఓపెన్ కిట్స్ అందించాం. వైసీపీ నాలుగేళ్ల పాలనలో మాదిగలకు ఏం చేశారో చెప్పే దైర్యం మీకుందా? మీకు చేతనేతే మాదిగలకు న్యాయం చేయండి తప్ప మాదిగలకు అన్ని విధాల న్యాయం చేసిన చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే సహించేది లేదు.

 

Leave a Reply