నేటి ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Spread the love

– తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొంతు శివసాంబిరెడ్డి

ఈనెల 19వ తేదీన తెలుగుదేశం పార్టీ అనుబంధ రైతు విభాగం తెలుగు రైతు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి బొంతు శివసాంబిరెడ్డి లు తెలిపారు. ఆదివారం వారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి:
వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. అడుగడుగునా రైతులను దగా చేస్తున్నారు. వారి దురాగతాలను ఎండగడతాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు దగాపడుతున్నాడు. రైతులను నిలువునా దోచుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం రైతును రాజుగా చూసి రైతురథాలిచ్చింది. వైసీపీ దళారులను తయారుచేసి దోచుకుంటోది. వ్యవసాయరంగాన్ని రోజు రోజుకు కునారిల్లేలా చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో భూసార పరీక్షలు ఉచితంగా చేయించింది.

టీడీపీ ఎన్టీఆర్ హయాంలో జలకళ పథకం పేరున ఉచితంగా బోర్లు తవ్వించి పంపుసెట్లు అందించింది. దానికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఆదుకుంది. విద్యుత్ అందుబాటులో లేనిచోట సోలార్ సిస్టమ్ ను పెట్టింది. మైక్రో న్యూట్రెన్స్ ని ఉచితంగా ఇచ్చింది.. ఉత్పత్తిని పెంచి రైతాంగానికి చేయూతనిచ్చింది. ప్రకృతి వైపరిత్యాల నుంచి బయటపడేలా చేసింది. నేడు వైసీపీ ప్రభుత్వం రైతులు పండించిన పంటలను ఆర్బీకేల పేరుతో దళారీ వ్యవస్తను తయారు చేసింది. 1960 రూపాయలు చొప్పున క్వింటా ధాన్యానికి రైతుకు చేరాల్సివుంటే 800ల నుండి 1100 రూపాయలకు రైతులనుండి దళారులు కొనుగోలు చేస్తున్నారు.

జగన్ అధికారంలోకి రాకముందు కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అధికారంలోకి రాగానే సుబాబుల్, జామాయిల్, కర్ర, టన్ను 5 వేలకు కొనుగోలు చేస్తానని చేసిన ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ప్రాజెక్టును పూర్తి చేసిన దాఖలాలు లేవు. అదనంగా ఒక ఎకరాకి నీరు పారించిన దాఖలాలు లేవు. మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచిన దాఖలాలు లేవు. అడుగడుగునా రైతాంగాన్ని దగా చేస్తు్న్నారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వమిది. వ్యవసాయరంగాన్ని కుదేలు చేశారు. రైతులపై పెనుభారాలు మోపుతున్నారు.

వ్యవసాయం మాకు వద్దు అనేలా రైతులపై వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఇచ్చిన విద్యుత్ రాయితీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. గతంలో టీడీపీ హయాంలో విద్యుత్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం తమ సొంత లబ్ది కోసం రద్దు చేసింది. అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ విషయాలన్నింటిని తెలియపరచదలిచాము. కావున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతు శివసాంబిరెడ్డి:
వైసీపీ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తానంటోంది. ఇది రైతుల మెడకు ఉరితాళ్లు బిగించినట్లే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రైతులను ఎంతగానో ఆదుకుంది. తెలుగుదేశం హయాంలో రైతులకు సున్నా వడ్డీకి రుణాలిస్తే వైసీపీ హయాంలో సున్నా వడ్డీ రుణాలు రద్దయ్యాయి. టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించి చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంది. అన్నదాత సుఖీభవ పథకం పెట్టి రైతులకు కార్డులిచ్చి బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు అవకాశం కల్పించింది. నాణ్యమైన పంటల ఉత్పత్తి కోసం బిందు తుంపర సేద్యం అందించి ఆదుకుంది. అనేక రకాలుగా రైతాంగానికి పూర్తిస్థాయి మద్దతు కల్పించింది. తెలుగు రైతు పిలుపును స్వీకరించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతు శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply