Suryaa.co.in

Andhra Pradesh

ఒంగోలులో 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసును ఖండించిన చంద్రబాబు

నినాదాలకే కేసులు ప్రభుత్వ దిగజారుడుతనం:- చంద్రబాబు

అమరావతి:- రాష్ట్రంలో మహిళల పై హింస విషయం లో నిరసన తెలిపిన టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తల పై అట్రాసిటీ కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతను చాటుతున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళకు భరోసా ఇవ్వాలంటూ మహిళా మంత్రి కాన్వాయ్ వద్ద మహిళలు నినాదాలు ఇవ్వడమే నేరం అన్నట్లు ఈ సిగ్గులేని ప్రభుత్వం వారిపై కేసులు పెట్టిందని మండి పడ్డారు.

రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న హింసను అరికట్టడం లో విఫలం అయిన జగన్ సర్కార్….తప్పుడు కేసులతో… గళమెత్తిన గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ఒంగోలులో నిరసన తెలిపిన 17 మంది తెలుగు మహిళలపై అట్రాసిటీ కేసులు పెట్టడం దిగజారిన ప్రభుత్వం స్థాయికి నిదర్శనం అన్నారు. అత్యాచారానికి గురైన మహిళ పేరును ఫిర్యాదు కాపీలో రాసి బహిర్గతం చేసిన అధికార పార్టీ నేతలు… ఇంతకంటే గొప్పగా రియాక్ట్ అవుతారు అని ఆశించడం కూడా తప్పెనేమో అన్నారు. ఒంగోలులో 17 మంది మహిళల పై పెట్టిన అక్రమ అట్రాసిటీ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని…అదుపులోకి తీసుకున్న మహిళలను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. తల్లులకు వారి బాధ్యతల గురించి చెప్పే ప్రజా ప్రతినిధులు…ముందు తమ బాధ్యత ఏంటో తెలుసుకోవడం అత్యవసరం అని చంద్రబాబు అన్నారు.

LEAVE A RESPONSE