– టీడీపీ దర్శి ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి : సామాన్యునిగా రాజకీయాల్లోకి వచ్చి సంక్షోభాలను ఎదుర్కొని ముందుచూపుతో అభివృద్ధి సంక్షేమాలను చిరునామాగా మార్చుకొని ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళ జైత్ర యాత్ర చేసిన స్ఫూర్తి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. హైదరాబాదును సైబరాబాద్‌గా మార్చి, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేశారు. దిగ్గజ కంపెనీలను ఆహ్వానించి యువతకు వేలాది ఉద్యోగాల అవకాశాలు కల్పించారు.
జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజా భాగస్వామ్య అభివృద్ధి ప్రారంభించారు. ఇంకుడు గుంటలు, వర్షాజల సేకరణ, మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రవేశపెట్టి నీటి యాజమాన్యంలో కొత్త దారులు చూపారు. రైతులకు రైతు బజార్లు, ఈ సేవ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతికతతో ముడివేశారన్నారు. పరిపాలనలో పారదర్శకత సాంకేతికతకు నాంది పలికారు. e-Governance, రియల్ టైమ్ గవర్నెన్స్, CM డాష్‌బోర్డ్ వంటి వ్యవస్థల ద్వారా ప్రతి శాఖపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. అధికారుల పనితీరుకు బాధ్యతను నిర్ధారించే విధానాలు అమలు చేశారని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాటి స్వప్నం విజన్ 2020 నిజమైంది, నేడు విజన్ 2047 కి శరవేగంగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.