కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
కోవూరు: ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపే శక్తి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో కలిసి కొడవలూరు మండలం యల్లాయపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోపిడీ తప్ప అభివృద్ధి ఊసెత్తని అధికార పార్టీ నాయకుల నిర్వాకాలకు విసుగెత్తిన జనం మార్పు కోరుతున్న విషయం స్పష్టమవుతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తనను, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.