Suryaa.co.in

Andhra Pradesh

కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్ అధికారులుగా మారారు

ఐపీయస్ అధికారుల సంఘం తీరు సరికాదు
తప్పును తప్పుగా ఎత్తిచూపుతున్న మీడియాపై విమర్శలు చేయడం దారుణం
ఎలక్షన్ కమిషనర్ కు పేర్లు పంపింది ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి కాదా?
తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోకనే పింఛన్ దారులను ఇబ్బంది పెట్టారు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్(జగన్ పర్సనల్ సర్వీస్) అధికారులుగా మారారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడిన మాటలు..

అధికారులు తప్పు చేస్తుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా నిలదీయటం తప్పా?

ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎన్నికలు సజావుగా జరగాలిని అధికారులను నిలదీయడం తప్పా? కొంతమంది ఐయస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ కి ఊడిగం చేస్తూ..ప్రజలకు వ్యవస్ధలపై నమ్మకం సన్నగిల్లేలా వ్యవహరించారు. ఐసీయస్ …జగన్ పర్సనల్ సర్వీస్ గా మారిపోయింది. ఇలాంటి అధికారుల నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాన్న నమ్మకం ప్రజల్లో లేదు.

అధికారులు తప్పు చేస్తుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా నిలదీయటం తప్పా? ఏయస్, ఐపీయస్ అధికారుల తప్పుల్ని ప్రశ్నించకూడదని రాజ్యాంగంలో ఉందా? టీడీపీ పక్షాన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఇతరపార్టీ నేతలు ఐసీపీయస్ అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేశారని, వాళ్లు ఫిర్యాదు చేసిన దానిలో వాస్తవం లేదని సీఈసీకి ఫిర్యాదు చేయటం సిగ్గుచేటు.

తాడేపల్లి ప్యాలెస్ కు కొందరు అధికారులు ఊడిగం చేస్తూనే ఉన్నారు
రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ కి ఊడిగం చేస్తూనే ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. అందరు అధికారులు కాకపోయినా కొందరు అధికారులు జేపీఎస్(జగన్ పన్సనల్ సర్వీస్) అధికారులుగా మారిపోయారు. ఇటువంటి అధికారుల నేతృత్వంలో ఎన్నికలు సజావుగా జరిగేనే అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు బృదం దాడి చేస్తే ప్రశ్నించకూడదా?
నందిగామలో స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, అతని సోదరుడు మొండితోక అరుణ్, అతని అనుచరులు ప్రజాస్వామ్యబద్ధంగా వారిని ప్రశ్నించినందుకు వాళ్లను చంపే ప్రయత్నం చేశారు. భద్రతా లోపం జరిగితే మేము మాట్లాడకూడదా? పోలీసు అధికారులు చాలా దిగజారారు. దాన్ని కోట్ చేసి తప్పని మాట్లాడారు. మీడియాపై నిందలు వేశారు. పక్షపాత ధోరణి పనికిరాదు. మేం లాజిక్ లేకుండా, ఈవిడెన్స్ లేకుండా, రీజన్ లేకుండా మాట్లాడము. మీరు వ్యవహరించిన తీరు బాగాలేదు. కొంతమంది అధికారులు ముఖ్యమంత్రికి, అధికార పార్టీకి తలొగ్గి పనిచేస్తున్నారు.

పూర్తిగా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి అనేక సంఘటనలున్నాయి. ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు చేతిలో దెబ్బలు తిన్నవారు ఎలాగో బతికి బయటపడగలిగారు. ఘోరంగా ఇనుప రాడ్లతో, కర్రలతో రౌడీ మూకలు దాడి చేశారు. వారిని చంపే ప్రయత్నం చేశారు. దాడిచేసినవారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయడం అన్యాయం. దెబ్బలుతిన్నవారిపైన్నే అక్రమ కేసులు పెట్టారు. అన్యాయంగా కేసులు పెట్టారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు. దానిపై మేము ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తే అది తప్పా?
ఐపీఎస్ అధికారుల సంఘం తీరు సరికాదు.

ఐపీయస్ అధికారుల సంఘం తీరు సరికాదు. సంఘం తరపున విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా నోటీసులు పంపారు. ఫిర్యాదు చేయడం తప్పా? కాంతిరాణా తీరు సరికాదు. జరిగిన సంఘటన కాంతిరాణా పోలీస్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది. ఇనుప రాళ్లతో తలలు పగులగొట్టిన వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయడం అన్యాయం. ఐపీసీ 307 సెక్షన్ పెట్టొచ్చు. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లడం తప్పెలాఅవుతుంది? మీకు ఆధారాలు కావాలంటే దెబ్బలు తిన్నవారు ఇప్పటికీ ఇన్సెంటీవ్ కేర్ యూనిట్ లో ఉన్నారు. మీడియా సమక్షంలో తేల్చుకుందాం. మీ పోలీసు కమీషనరేట్ లో నిన్న గాక మొన్న ఈ సంఘటన జరిగితే రాణా ఎందుకు చర్యలు తీసుకోలేదు? దేనికి చర్యలు తీసుకోలేకపోయారు?

అధికారుల బదిలీలతో ఉపయోగం లేదు
మొన్న ఎలక్షన్ కమిషన్ ఐదుగురు ఐపీఎస్ అధికారులల్ని, ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేశారు. ఎస్పీ ప్రకాశం పరమేశ్వర్, పల్నాడు రవిశంకర్ రెడ్డి, ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను బదిలీ చేశారు. ఈ బదిలీల వల్ల ఉపయోగంలేదు.

చిత్తూరు ఎస్పీ ఝాషువా నిర్వాకాలు అందరికీ తెలిసిందే
చిత్తూరు ఎస్పీ ఝాషువా ల గురించి ఎవరికి తెలియదు. ఈ ఝాషువ కృష్ణా జిల్లా ఎస్పీగా ఉండి తోట్ల వల్లూరు స్టేషన్ లో నా పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నేను ఆ రోజున చచ్చి బతికాను. ఆరోజు ఎస్పీ ఝాషువ చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు. ఎస్పీ ఝాషువ తోట్ల వల్లూరు స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి కొంతమంది నాకు ముసుగు వేసి 45 నిమిషాలపాటు కొట్టించారు.

గన్నవరంలో వైసీపీ రౌడీ మూకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగులబెడితే.. నాపై హత్యా యత్నం జరిగితే నన్ను కాపాడాల్సిన పోలీసులు నన్ను తోట్ల వల్లూరు స్టేషన్ కు తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇటువంటి వ్యక్తులు ఖాకీ డ్రస్ వేసుకున్న రౌడీలు. జగన్ కు తొత్తులుగా మారారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇలాంటి వ్యక్తిని ఏరి కోరి చిత్తూరుకు తీసుకెళ్లారు. వచ్చే ఎన్నికల్లో అరాచకాలు సృష్టించడానికే పెద్దిరెడ్డి చిత్తూరుకు తీసుకెళ్లారు. ఎస్పీ చరిత్రేంటో కృష్ణా జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. ఎస్పీ ఝాషువా చేసిన నిర్వాకం వల్ల నేను బలయ్యాను. గన్నవరం సంఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇటువంటి అధికారులను తొలగించాలి. మళ్లీ కొత్త అధికారులను నియమించడానికి పేర్లు ప్రతిపాదించమని అడిగితే నేడు ఈ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరి లిస్టు పంపారు. మళ్లీ అధికారులను నియమించే పరిస్థితి ఉంటుంది. వైసీపీ అధికారులకు కొమ్ముకాసే అధికారుల జాబితానే పంపిస్తారు. దీన్ని ప్రశ్నించకూడదా?

నెల్లూరు ఎస్పీ భాగోతం కూడా అందరికీ తెలుసు
నేడు నెల్లూరు ఎస్పీగా నియమింపబడిన వ్యక్తి చరిత్ర అందరికీ తెలుసు. అతను వైసీపీకి ఊడిగం చేసే వ్యక్తి. సీఎస్ అటువంటి వ్యక్తుల పేర్లు ప్రతిపాదించారు. ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి ఈ విషయంపై సమాధానం చెప్పాలి. మీడియా దీని గురించి రాస్తే తప్పేంటి. ప్రతిపాదించిన పేర్లను పరిశీలిస్తే ఖచ్చితంగా మీరు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ అధికార పార్టీకి మేలు చేయాలనే దురుద్దేశంతో కావాలనే వారికి అనుకూలంగా ఉండేవారి పేర్లనే ప్రతిపాదించారు. ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిన పేర్లనే ఎదిరిస్తారా అని మరో తప్పుగా మాకే అంటగడతారు. ఎలక్షన్ కమిషనర్ కు పేర్లు పంపింది ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి కాదా?

ఎన్నికల కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కిన ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి :
మొన్న ఇదే ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా తుంగలో తొక్కారు. పెన్షనర్ల విషయంలో వలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అందుబాటులో ఉన్న మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎన్నికల కమిషనర్ స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం ఏ విధంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందో అలాగే చేపట్టండి అని చెప్పింది.

ఎన్నికలు సజావుగా జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు
ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలౌతోంది. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ రాష్ట్రలో ఎన్నికలు సజావుగా జరగడానికి అన్నిరకాల ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.

వైసీపీ పాలనలో కొందరు పోలీసుల అధికారుల నిర్వాకంతో వ్యవస్థకు చెడ్డపేరు వచ్చింది. పోలీస్ డిపార్ట్ మెంట్పైంన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. టీడీపీ నేతలు, ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. కలంకిత అధికారులను నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉంది.

నా ఇంటిని ధ్వంసం చేసి, నాపై దాడి చేసి నన్ను గాయపరిస్తే ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్ మెంట్ ఏం చర్యలు తీసుకున్నారు? గన్నవరంలో నాపై హత్యాయత్నం చేస్తే నాపై విచక్షణారహితంగా దాడి చేసి జైలుకి పంపారు. రాష్ట్రంలో ఊడిగం చేసిన అధికారుల కారణంగా బాధితులే నేరస్థులైన పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన అఘాయిత్యాలపై ఏం చర్యలు తీసుకున్నారో కాంతిరాణా టాటా గారు సమాధానం చెప్పాలి.

నాపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఒక్కరినైన అరెస్ట్ చేశారా? చెన్నుపాటి గాంధీపై దాడి చేసి కన్నుపోగుట్టుకునే పరిస్థితికి తెచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే పోలీస్ ఉన్నతాధికారులు పద్ధతిమార్చుకొని నిష్పక్షపాతంగా, నిజాయితీగా వ్యవహరించాలని టీడీపీ తరపున కోరుతున్నాం. ఇదే రకంగా అధికారపక్షానికి కొమ్ముకాస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తప్పును తప్పుగా ఎత్తిచూపుతున్న మీడియాపై విమర్శలు చేయడం దారుణం. సీఎస్ జవహర్ రెడ్డి తన బాధ్యతను మరచి పెన్షనర్స్ విషయంలో తప్పు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి బాధ్యులయ్యారు.

ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారకులైన మీపైన కూడా కేసు పెట్టాలి. ఎన్నికల కమిషన్‌కు విరుద్ధంగా సీఎస్, సెర్ఫ్ సీఈవో సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్షాలు చర్యలు తీసుకోవాలని కోరిన పట్టించుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోకనే పింఛన్ దారులను ఇబ్బంది పెట్టారు. దీనిపై మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంది. మిమ్మల్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజాయితీ, నిష్పక్షపాతంగా ఉంటే మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం మీడియాకు, ప్రతిపక్షాలకు ఏమొచ్చిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు.

LEAVE A RESPONSE