• పొలాల్లో తడిచిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన చంద్రబాబు
• రైతులను అడిగి సమస్య తెలుసుకున్న చంద్రబాబు
• ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే చేతి కందిన ధాన్యం తడిచిపోయిందని చంద్రబాబు ముందు కన్నీటి పర్యంతమైన రైతులు
• ప్రతి మిల్లులో ధాన్యం ఆడించడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వాపోయిన రైతులు
ఎస్. ముప్పవరంలో రైతులనుద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…..
• రైతులు కష్టాల్లో ఉంటే జగన్ ఎక్కడ? సీఎంకి రైతుల్ని పరామర్శించే బాధ్యత లేదా?
• అకాల వర్షాలకు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు
• వైసీపీ నేతలు, మిల్లరులు కలిసి రైతుల్ని దోపిడి చేస్తున్నారు
• మిల్లర్లు ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు , వారికి లైసెన్సు ఏమైనా ఇచ్చారా?
• 72 గంటల్లో ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఎవరు పారబోయొద్దు
• ధాన్యం కొనుగోలు చేయకపోతే మనమే సీఎం జగన్ నివాసం తాడేపల్లి ప్యాలెస్ తీసుకువెళ్దాం
• సీఎం జగన్ ఇంటి ముందు ఈ ధాన్యం తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి
• పోరాడితే నష్టం లేదు.. కేసులు పెడతారని రైతులు భయపడొద్దు
• నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు ప్రభుత్వాన్ని వదలి పెట్టం
• రైతులకు అండగా ఉంటాం, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం
నిడదవోలు నియోజకవర్గం కాట కోటేశ్వరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…..
• ఏపీలో దళారుల రాజ్యం నడుస్తుంది
• రైతు దగా ప్రభుత్వమే ఇది
• ప్రభుత్వ వైఫల్యమే రైతుల పట్ల శాపంగా మారింది
• దళారులు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
• భారీ వర్షాల వల్ల ధాన్యం రైతులు బాగా నష్టపోయారు, తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదు.
• ధాన్యం పొలం నుంచి నేరుగా రైస్ మిల్ కు వెళ్లాలి, సంచులు లేక ధాన్యం పొలంలోనే తడిసిపోయాయి.
• ప్రభుత్వ వైఫల్యం వల్లే ధాన్యం రైతులు నష్టపోయారు, పంటంతా నీట మునగడం వల్ల పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
• నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు, ఆర్బీకే వ్యవస్థ ఏమైంది?.. సైకో జగన్ చెప్పాలి
• ధాన్యం రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు, మా పంట మునిగింది.. పరిహారం ఇవ్వాలనే నినాదంతో ఆందోళనలు నిర్వహిస్తాం
• మంత్రులు సొల్లు కబుర్లు ఆపి ధైర్యముంటే రైతుల దగ్గరకు రావాలి, సీఎం క్షేత్రస్థాయికి వస్తే వాస్తవాలు తెలుస్తాయి.
• తాడేపల్లి కొంపలో కూర్చుంటే వాస్తవాలు తెలియవు, నేను వచ్చాక రైతులకు గోనె సంచులు పంపారు.
• రైతులకు ధైర్యం ఇవ్వడానికే నేను వచ్చా, పోలీసులు బ్యాడ్జ్ లు పెట్టుకోకుండా వచ్చి రైతులను బెదిరిస్తున్నారు
• రైతులకు దైర్యంగా నేను నిలబడతా, రైతులకు న్యాయం జరిగే వరకూ.. వారి తరపున పోరాడతా.
• రైస్ మిల్లర్లు సీఎం ఒత్తిడికి లోనై రైతులను ఇబ్బంది పెట్టొద్దు, రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్లు జైలుకు వెళ్లక తప్పదు.
• డబ్బులు తీసుకున్న మిల్లర్లపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతాం, పోలీసులు కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కేసు వేస్తాం.
• రైతులు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు , మీకు అండగా నేనుంటా ప్రభుత్వంపై పోరాడదాం.
• రైతుల ముందు నేనుంటా.. అరెస్ట్ చేస్తే నన్ను చేయనివ్వండి,
• ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేయించే బాధ్యత నాది, రైతులు ఐక్యమత్యంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది.
• పేద రైతులు, కౌలు రైతులంటే జగన్ కి లెక్క లేదు, అహంభావంతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
• 72 గంటల డెడ్ లైన్ అయ్యాక మళ్లీ నేను వస్తా.. అప్పట్నుంచి పోరుబాటే, 72 గంటల తర్వాత నా పోరాటం ఎలా ఉంటుందో వైసీపీ ప్రభుత్వానికి చూపిస్తా
నిడదవోలు నియోజకవర్గం సమిస్త్రి గూడెంలో రైతులను ఉద్దేశించి చంద్రబాబునాయుడు ప్రసంగం :-
• ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు రోజుల్లో 8 నియోజకవర్గాల్లో పర్యటించాను. రైతుల కష్టాలు, బాధల్ని చూశా.
• ధాన్యం సేకరణలో పాత విధానం తీసివేసి….ఆర్ బికె వ్యవస్థను తీసుకువచ్చారు.
• రైతు భరోసో కేంద్రాలు.రైతు దగా కేంద్రాలుగా తయారయ్యాయి.
• పంట అమ్ముకునే రైతుకు డబ్బు ఇవ్వకపోగా…వారే డబ్బలు కట్టాలి అంటున్నారు
• ఆర్బికె నిబంధనల ప్రకారం పనిచేస్తుందా లేదా….సిఎం చెప్పాలి, నిబంధనలు అమలు అయితే రైతులు మిల్లుకు డబ్బు ఎందుకు కట్టాలి? ఎందుకు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదు.
• మిల్లర్లు ట్రాక్టర్ కు 20 వేల రూపాయలు కూడా కట్టించుకుంటున్నారు.
• రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మిల్లర్లపై ఎందుకు కేసులు పెట్టలేదు.మిల్లర్లు వసూలు చేసిన డబ్బు తాడేపల్లి ప్యాలెస్ కో పోతుంది…అందుకే వారిపై కేసులు పెట్టడం లేదు.
• ఆర్బికె సెంటర్ లో మొన్నటి వరకు ఆన్ లైన్ అన్నారు…మళ్లీ ఆఫ్ లైన్ అంటున్నారు. అందుకే తుగ్లక్ పాలన అనేది.
• ఏ తప్పు చేయని ఆదిరెడ్డి అప్పారావుపై కేసుపెట్టిన ప్రభుత్వం….రాజమండ్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం తప్పు చేసిన రైస్ మిల్లర్ల పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
• మద్దతు ధర రూ. 1530 ఎందుకు ఇవ్వడం లేదు….రైతుల నుంచి కొట్టేసిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో తేలాలి
• రైతులు భయపడవద్దు…పిరికి తనం వద్దు…మీకోసం నేను అండగా ఉంటా
• నేడు రైతు, కౌలు రైతు నాశనం అయ్యారు. ఏప్రిల్ 1 నుంచి ఎందుకు ధాన్యం సేకరించలేదు. సంచులు ఎందుకు సిద్దం చేయలేదు.
• తెలుగు దేశం ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు, నాడు అక్రమాలకు పాల్పడితే రైస్ మిల్లర్లు సహా అందరినీ అరెస్టు చేశాం.
• సివిల్ సప్లై కార్పొరేషన్ గా భాస్కర్ రెడ్డి….మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన కొడుకు, ఇంకో కొడుకు ఎమ్మెల్యే. వీరంతా కలిసి రైతుల్ని దోచుకుంటున్నారు.
• జగన్ పెళ్లిళ్లు, పేరంటాల్లో బిజీ గా ఉన్నాడు. రైతులు పట్టడం లేదు.
• ప్రభుత్వం బస్తాకు రూ.1530 ఇచ్చి తీరాలి. పొలంలో ఉండే పంటకు బీమా చేయించలేదు. దీంతో రైతులునష్టపోయారు.
• వరి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి, మెక్కజొన్నకు కూడా ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి.
• రైతులు ఏం నష్టపోయారో వీడియోలు తీసి పంపండి. ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేలా ఒత్తిడి తెద్దాం, వాళ్లు ఇవ్వకపోతే…టీడీపీ ప్రభుత్వం వచ్చాక నష్టపరిహారం ఇస్తాం.
• పాడైన ధాన్యం సేకరించకపోతే….జగన్ ఇంటికి ఈ ధాన్యం పంపుదాం. ఆయన ఎలాగూ బయటకు రాడు….మనమే అక్కడికి ఈ ధాన్యం పంపుదాం.
• 72 గంటల్లో ప్రభుత్వం మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే…పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తాం.