– రాజకీయ కుట్రతోనే అక్రమ కేసులతో అరెస్టు
– టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. శనివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….అనేక పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ద పదంలో నడిపి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని కేవలం రాజకీయ కుట్రలతోనే అరెస్ట్ చేసి జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు.
నేటితో వైసీపీకి కాలం చెల్లింది. స్కిల్ డెలవప్ మెంట్ లో అవినీతి జరిగిందన్నది వైసీపీ అబద్దపు ప్రచారం మాత్రమే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఏపీతో పాటు తెలంగాణ, గుజరాత్ సహా మొత్తం 8 రాష్ట్ర ప్రభుత్వాలతో సిమెన్స్ ఒప్పందం చేసుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ పనితీరు బాగుందని గతంలో వైసీపీ ప్రభుత్వమే అభింనందన పత్రం అందజేయలేదా?
కేవలం కక్ష్యతోనే అక్రమ కేసులతో అరెస్టు చేశారు, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని హైకోర్టు చెప్పింది. మా నాయకుడిని అక్రమ అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకుంటామా? వైసీపీ అవినీతి, అక్రమాల్ని కప్పి పుచ్చు కునేందుకే అక్రమ అరెస్టు చేశారు. గతంలో వైయస్ చంద్రబాబు నాయుడుపై 26 ఎంక్వైరీలు వేసి ఏం సాధించారు? వచ్చే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు టీడీపీ గెలవబోతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే వీళ్ల సంగతి తేలుస్తాం.
వైసీపీ నేతలకు సబ్జెక్ట్ తెలిస్తే మాట్లాడండి, లేకుంటే నోరు మూసుకోండి. మా నాయకుడిని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం. మంత్రిగా, గతంలో ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా ఎంత అవినీతి చేసిందో ప్రజలకు తెలియదా? పోలవరంకు ఎన్ని గేట్లు ఉన్నాయో తెలియని మంత్రి రాంబాబు చంద్రబాబు పై విమర్శలు చేస్తారా? వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, చంద్రబాబు నాయుడిపై ఇష్టానుసారం మాట్లాడితే సహించబోమని పంచుమర్తి అనురాధ అన్నారు.