– ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో పాటు పలువురు మంత్రులు, కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతమని, ఈరోజు ఏపీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన రోజు అని కొనియాడారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమించారన్నారు.
నాడు చంద్రబాబు ఇంటర్నెట్ అంటే నవ్వారని, ఇవాళ పంప్‍సెట్‍ను కూడా ఇంటర్నెట్ ద్వారా నడిపిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా సంపాదించే జాబితాలో తెలుగువాళ్లు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు అన్నారు.