అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ

94

-కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ
-గుడిపల్లె మండలం గుతర్లపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని లేఖ

చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత:-
కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతున్నా అక్రమాలు ఆగలేదు.అధికార పార్టీ నేతలతో మైనింగ్ , రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యి అక్రమ మైనింగ్ కు సహకరిస్తున్నారు.పకృతి సంపదను కొల్ల గొట్టి…పర్యావరణం దెబ్బతీసేలా అక్రమ మైనింగ్ జరుగుతుంది.అక్రమంగా మైనింగ్ చేసి తరలిస్తున్న పది గ్రానైట్ లారీలను అధికారులు సీజ్ చెయ్యడం అక్కడి పరిస్థితి అద్దం పడుతుంది.తనిఖీలు పెంచి అక్రమ మైనింగ్ ను వెంటనే అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.సీజ్ చేసిన గ్రానైట్ లారీల ఫోటోలను లేఖకు జత చేసిన టిడిపి అధినేత చంద్రబాబు.