Suryaa.co.in

Andhra Pradesh

కరోనా నిధులు దారి మళ్లించటం శవాల మీద చిల్లర ఏరుకోవడమే

-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల నిధులు సైతం మళ్లించారు
-జగన్ రెడ్డి చేతకాని పాలనతో రాష్ట్రం మరో శ్రీలంకలా మారింది
– బత్యాల చెంగల్రాయుడు

పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఓ వైపు అప్పులు తెచ్చి లూటీ చేస్తూ మరో వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించటమే కాక చివరకు కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులు సైతం దారి మళ్లించటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

కేంద్ర ప్రభుత్వం విపత్తు నిధి కింద కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1,100 కోట్ల మేర నిధుల నుంచి వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. నేషనల్ డిజాష్టర్ రిలీఫ్ ఫండ్ ను పిడి ఎకౌంటులోకి మార్చటం దుర్మార్గపు చర్య. ఏఅవసరాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు ఉపయోగించాలంటే వాటికే వినియోగించాలి. కానీ కరువు కోసం అని చెప్పి ఆ నిధులను వేరే వాటికి ఎలా మళ్లిస్తారు? ఎస్‌డీఆర్‌ఎఫ్ కు సంబంధించిన ఏ వ్యయాన్ని అయినా 2245 నం. గల మేజర్‌ హెడ్‌ కిందనే నమోదు చేయాలి. పబ్లిక్‌ ఖాతాలో నమోదు చేయకూడదు. విపత్తుల నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ఖాతా నుంచి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడానికి వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు (పీడీఏ) నిధులు మళ్లించడమే కాకుండా రెండేళ్లుగా వాటిని వినియోగించపోవటం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించటమే.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఒక్క రూపాయి కూడ ఆర్థిక సాయం చేయకపోగా నేషనల్ డిజాష్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్రం ఇచ్చిన డబ్బును మృతుల కుటుంబాలకు ఇవ్వకుండా నిదుల్ని దారి మళ్లించటం శవాలు మీద చిల్లర ఏరుకోవడమే. పొంతన లేని స్టేట్ మెంట్లతో ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్ధానానికి సైతం తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. కరోనా మృతుల లెక్కల్లోనూ వైసీపీ ప్రభుత్వం తప్పులు లెక్కలు చూపింది. 2019,2020లో ప్రభుత్వ వైఫల్యంతో లక్షల్లో కరోనాతో ప్రజలు చనిపోతే ప్రభుత్వం మాత్రం చనిపోయిన వారి సంఖ్యను కేవలం 36 వేలుగా చూపడటం దివాళుకోరుతునం. కరోనాతో చనిపోయిన వారిని కూడ కరోనా నుంచి బయటపడ్డాక చనిపోయారు అని తప్పుడు సమాచారం ఇచ్చారు.

కరోనాతో అడ్మిట్ అయి రికవరీ అయి ఇంటికి వచ్చాక చనిపోయిన కరోనాతో చనిపోయినట్లే అవుతుంది. కానీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. నా డ్రైవరు కరోనా వచ్చి రికవరీ అయ్యి ఆ కరోనా ప్రభావంతోనే చనిపోయాడు. కానీ ప్రభుత్వం అతని కుటుంబ సభ్యులకు సాయం ఇవ్వలేదు. కేరళ, కర్ణాటక, ఢిల్లీ, ఇతర పొరుగు రాష్ట్రాలలో కరోనాతో చనిపోయిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్థిక సాయం ఇవ్వటంతో పాటు నేషనల్ డిజాష్టర్ రిలీఫ్ ఫండ్ ను కూడ పూర్తిగా వారి కుటుంబాలకు అందజేశాయి. కేరళలో రూ. 3 లక్షలు, కర్ణాటక, ఢిల్లీలో 50వేల రూపాయలు కరోనా మృతులకు ఇచ్చారు. కానీ ఏపీ లో కరోనా వల్ల 14,471 మరణాలు అని చెప్పి 11వేల మందికి డబ్బులు ఇచ్చాం అని వైసీపీ చెబుతోంది. సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో 36,205 క్లైమ్స్ వచ్చాయని చెప్పారు. మరి కేంద్రం నేషనల్ డిజాష్టర్ మేనేజ్మెంట్ కింద రూ. 1100 కోట్లు ఇస్తే ఎందుకు వారి కుటుంబాలకు ఇవ్వలేదు? దీనికి సంబంధించి నిధులను దారి మళ్ళించారని కాగ్ కూడా నివేదిక ఇచ్చింది.

జగన్ రెడ్డి కేవలం కరోనా నిధులు మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందాల్సిన నిదుల్ని సైతం దారిమళ్లించారు. మహిళల అభ్యున్నతి కోసం వారు కూడ బెట్టుకున్న అభయ హస్తం నిధులు రూ. 2,10 కోట్లు దారి మళ్లించారు. బిసి కార్పోరేషన్ 26 వేల కోట్లు, ఎస్సీ కార్పోరేషన్ రూ. 6,548 కోట్లు, ఎస్టీ కార్పోరేషన్ 1000 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ రూ. 1500 కోట్లు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. చివరకు పంచాయితీ, మున్సిపాలిటి నిధులు రూ. 12 వేల కోట్లు దారిమళ్లించారు. కడప జిల్లా పరిషత్ సమావేశంలో చైర్మన్ సమక్షంలో సభ్యులంతా జిల్లా పరిషత్ కు వచ్చిన నిధులను, మండలాలకు, గ్రామ పంచాయితీకి వచ్చిన నిధులను ప్రభుత్వం దారి మళ్ళించడం వల్ల మేము గెలిచినందుకు ప్రజలకు ఏం న్యాయం చేయాలని గెలిచినందుకు కూడ సిగ్గుగా ఉందని వచ్చిన నిధులను తక్షణం వెనక్కి ఇవ్వాలని, లేదంటే అందరు రాజీనామాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని జెడ్పీటీసీ లంతా ఆందోళన చేసిన పరిస్దితి.

కరోనా సమయంలో మందులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ఇంత వరకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు. దీంతో వాళ్ళు మందులను సరఫరా చేయలేమని చేతులెత్తేశారు. కరోనా సమయంలో మందులు బ్లాక్ లో అమ్ముకున్నారు. రూ. 3 వేల విలువైన మందుల్ని రూ. లక్ష రూపాయలకు అమ్యారు. హెటిరో పార్థసారధి ఇంటి మీద ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే గుట్టలు గుట్టలుగా దారి మళ్ళించిన నిధులన్ని దొరికాయి. భవిష్యత్తులో కరోన 4వ దశ అతి వేగంగా పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులు వస్తే ఎవరైనా మన రాష్ట్రానికి అప్పు ఇస్తారా.. ప్రభుత్వం ఎందుకు కరోనాను ఎదుర్కోవడానికి డబ్బును ఖర్చు పెట్టలేకపోతుంది? ఫ్రంట్ లైన్ వారియర్స డాక్టర్లు, నర్సులు, టీచర్లు, పోలిసులు, పారిశుద్ధ కార్మికులు, ఇతరత్ర వాళ్ళు, వీరందరికి కూడ సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కరోనా సమయంలో జీతాలు ఇవ్వక ఆర్థిక పరిస్థితి బాగోక ప్రజలు ఆకలితో అలమటించారు. కరోనా సమయంలో మన రాష్ట్ర ఆదాయం ఏమైనా తగ్గిందా.. గతంలో ఉన్నట్టే ఉంది కాని ఎక్కడ తగ్గలేదు. మీరు ఇచ్చిన బడ్జెట్ లోని అది తెలుస్తుంది. టీచర్లను మందు దుకాణాల వద్ద పెట్టారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వాడటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు హక్కు కల్పించారు? వాడుకున్న నిధుల్ని వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేస్తాం అని కేంద్రం అంటుంది, వడ్డీతో కట్టగలిగే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? నరేగా నిధులు కూడ వైసీపీ ప్రభుత్వం వాడుకుంది. దీనపై కోర్టు స్పందించి 3 రోజులోపు పు తిరిగి చెల్లించకపోతే 12శాతం వడ్డీ వేసి వసూల్ చేస్తాం అని కేంద్రం చెప్పిన మాటలు మర్చిపోయారా? కరోనా 4వ దశలో కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని రాష్ట్రం ఇస్తుందని ప్రచారం చేసుకున్నారు. ప్రజలకు పౌష్ఠికాహారం గురించి మరిచారు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు ప్రజలకు పౌష్ఠికాహారం గురించి ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రం ఎందుకు ఇవ్వలేకపోతుంది. మొదట దశ కరోనాలో బ్లీచింగ్ పౌడర్ నిదుల్లో సైతం అవతకతవకలకు పాల్పడ్డారు. బ్లీచింగ్ పౌడరు పేరుతో మైదా పిండి చల్లారు.

కరోనాతో చనిపోయిన వారి లెక్కలను సంక్రమంగా చూపిస్తే వారికి ఆర్థిక సాయం చేయాలన్న కారణంతో చనిపోయిన వారి పేర్లను కూడ రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చలేదు. తక్షణమే దారి మళ్లించిన నేషనల్ డిజాష్టర్ రిలీఫ్ ఫండ్ నిధులు రూ. 1,100 కోట్లు తిరిగి జమచేయాలి. కరోనా 4వ దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కరోనా ఫ్రంట్ లైన్లు వారియర్లు, అంగన్ వాడీలకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. జగన్ రెడ్డి చేతకాని పాలనతో రాష్ట్రం దివాలా తీసి మరో శ్రీలంకలా తయారైంది. కాబట్టి కేంద్రం ఇస్తున్న నిధుల్ని దారి మళ్లించకుండా ప్రజలకు న్యాయం చేయాలని బత్యాల చెంగల్రాయుడు అన్నారు.

LEAVE A RESPONSE