-
గణపతి విగ్రహం వద్ద అపచారం
-
చెప్పులతో తిరుగుతూ చికెన్ బిర్యానీ తింటున్న ముస్లిం మహిళలు
-
భక్తుల తిరుగుబాటుతో పారిపోయిన వైనం
-
కళ్లు మూసుకున్న శ్రీశైలం ఆలయ అధికారులు
-
సోషల్‌మీడియా వైరల్ అవుతున్న చికెన్ బిర్యానీ
-
దేవాలయ అధికారులపై హిందూ సంస్థల ఆగ్రహం
-
ఆలయాల్లో అన్యమతస్తుల లెక్క తేల్చరా?
-
ఆలయ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకివ్వరు?
-
ఉద్యోగులకు సర్కారు భయపడుతోందా?
-
దేవ దాయశాఖ నిద్రపోతోందా?
-
ఎల్వీ ఆదేశాలు ఏమైనట్లు?
-
సోషల్‌మీడియాలో శివమెత్తుతున్న హిందూ సంస్థలు
( అన్వేష్)
శ్రీశైల శిఖర దర్శనే పునర్జన్మ నవిద్యతే.. శ్రీశైల శిఖర దర్శనం అయితే ఇక పునర్జన్మ ఉండదని దాని భావన. అలాంటి శ్రీశైల శిఖర సమీపంలోని, గణపతి విగ్రహం వద్ద జరిగిన ఘోర అపచారం.. దేవదాయశాఖ నిర్లక్ష్యం.. హిందువుల ఆగ్రహానికి దారితీసింది.
విగ్రహ ప్రాంతంలో పలువురు ముస్లిం మహిళలు ఎంచక్కా విగ్రహ అరుగులపై కూర్చుని, చికెన్ బిర్యానీ తింటున్న వీడియో హిందువుల ఆగ్రహానికి కారణమయింది. కాళ్లకు చెప్పులతో విగ్రహ ప్రాంతంలో తిరగడంతో శివభక్తులు శివమెత్తుతున్నారు. ఇది హిందూ దేవాలయాలంటే పాలకుల లెక్కలేనితనానికి నిదర్శనమంటూ, హిందూ సంస్థలు దేవదాయశాఖను సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్నాయి.
శ్రీశైల శిఖరం సమీపంలోని గణపతి విగ్రహం వద్ద.. హిందువుల మనోభావాలు గాయపడే దారుణమైన అపచారం చోటుచేసుకుంది. పలువురు ముస్లిం మహిళలు బురఖాలు వేసుకుని, అక్కడికి చెప్పులతో వెళ్లారు. మామూలుగా ఏ దేవాలయ ప్రాంతాల్లోనయినా, భక్తులను చెప్పులతో లోపలికి వెళ్లనీయరు. అలాంటిది ఆ ముస్లిం మహిళల బృందం చెప్పులతోనే లోపలికి వెళ్లింది. వెళ్లడమే కాదు. తమతో తెచ్చుకున్న చికెన్ బిర్యానీ పార్శిళ్లను, అక్కడి విగ్రహం అరుగు మీద కూర్చుని ఎంచకా తినడాన్ని అక్కడున్న శివభక్తులు చూసి, నిలదీశారు.
గుడిలో మాంసం తినకూడదని తెలియదా? మీరు మనుషులా? పశువులా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. దానితో తమకు తెలియదని అమాయకంగా సమాధానం చెప్పిన వారిపై , మహిళా భక్తులు విరుచుకుపడ్డారు. మీ మసీదుల్లో కూడా ఇలాగే తింటారా అని వాగ్వాదానికి దిగారు. అసలు మిమ్మల్ని చెప్పులతో లోపలికి ఎవరు రానిచ్చారంటూ మండిపడ్డారు.
అయితే చేసిన తప్పుకు పశ్చాత్తపంతో క్షమించమని కోరడం బదులు, ఆ బృందం మహిళా భక్తులతో వాగ్వాదానికి దిగారు. చివరాఖరకు శివమెత్తిన భక్తుల ఆగ్రహానికి తాళతాక, చెప్పులతో అక్కడికి వచ్చిన ముస్లిం మహిళల బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలన్నీ సోషల్‌మీడియాలో
వెలుగుచూసినవే. ఎవరో చేసిన ఆరోపళు కావు. అసలు ముస్లిం మహిళల బృందం బురఖా వేసుకుని, చెప్పులతో విగ్రహం వద్దకు వెళుతున్నా అడ్డుకోకుండా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది? అక్కడ సెక్యూరిటీ ఉన్నట్లా? లేనట్టా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ సంస్థలు భగ్గుమంటున్నాయి. హిందూ ఆలయాలకు భద్రత లేదనడానికి.. శ్రీశైలంలో ముస్లిం మహిళలు చికెన్ బిర్యానీ తిన్న సంఘటనే నిదర్శనమంటూ మండిపడుతున్నాయి. దీనికి బాధ్యులైన వారిని శిక్షించకపోతే, మరికొన్ని దేవాలయాల్లో ఇలాంటి ధిక్కార పర్వమే కొనసాగే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. ఇది హిందూ ఆలయాలంటే పాలకుల లెక్కలేని తనానికి నిదర్శనమన్న కామెంట్లతో మండిపడుతున్నారు.
కాగా ఏపీలోని అన్ని దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి.. తాను హిందువునేనంటూ డిక్లరేషన్ ఇవ్వాలన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గత ఆదేశాలు, బుట్టదాఖలవడంపై, హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి, దేవదాయశాఖ ఎందుకు సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
‘ ప్రతి ఒక్క ఉద్యోగి తాను హిందువునేనంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని, ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్‌గా ఉండగా ఇచ్చిన ఆదేశాలు దేవదాయశాఖ కమిషనర్లు ఇప్పటిదాకా ఎందుకు అమలుచేయలేదు? అసలు దేవాలయ ఈవోలలో ఎంతమంది మతం మారిన వారున్నారో ఎందుకు లెక్క తీయరు? ప్రభుత్వం ఆలయ ఉద్యోగులకు ఎందుకు భయపడుతోంది’’ అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. తిరుపతి, శ్రీశైలం, సింహాచలం వంటి పెద్ద దేవాలయాల్లో ఇప్పటికీ, వందలాది మంది మతం మారిన ఉద్యోగులు పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
బీజేపీ ఎక్కడంటూ ప్రశ్నలు..
శ్రీశైలంలో చికెన్ బిర్యానీ తింటున్న ముస్లిం మహిళల వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో.. నెటిజన్లు-హిందూ సంస్థలు బీజేపీపై విరుచుకుపడుతూ, ప్రశ్నలవర్షం కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా జగన్ జమానాలో జరిగిన అంతర్వేది రథం దహన కేసును గుర్తు చేస్తున్నాయి. దానిపై సీబీఐ కేసు ఏమైంది? ఇప్పుడు రెండుచోట్లా మీప్రభుత్వమే ఉంది కదా? మరి సీబీఐ ఎప్పుడొస్తుంది? జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులపై, ఇప్పుడయినా చర్యలు తీసుకునే ధైర్యం లేదా? అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయారా? శ్రీశైల శిఖర దర్శన సమీపంలోని విగ్రహం వద్దనే ముస్లిం మహిళలు, చికెన్ బిర్యానీ తింటున్న వీడియోలు మీరు కూడా దర్శించారుకదా? దీనికేమంటారు? అంటూ హిందూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.