Suryaa.co.in

Telangana

చెప్పులు కుట్టే చేతులు చరిత్రను సృష్టించేలా చేశారు

  • వర్గీకరణ అమలు చేసింది మొట్టమొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే
  • ఏబీసీడీ వర్గీకరణ సాధించే కృషిలో “బాబు” మార్క్ ఎనలేనిది
  • ఎస్సీ వర్గీకరణకు సహకరించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బక్కని నర్సింహులు
  • తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు

చెప్పులు కుట్టే చేతులు చరిత్ర సృష్టించాలి.. మళ్లీ వర్గీకరణ జరిగితేనే అది సాధ్యమవుతుంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగలను ఉద్దేశించి 2012లో “వస్తున్న మీకోసం” కార్యక్రమం సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్న మాటలు నేడు నిజమయ్యాయని.. ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ సాధించే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిని జాతి మరువరానిదని, అందుకే మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు .

ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఆనాడే చెప్పి మందకృష్ణ మాదిగ దండోరాకు ఆనాడే మద్దతు పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. చెప్పులు కుట్టే చేతులు చరిత్ర సృష్టించాలి అన్న ప్రసంగం నేటికీ పాలమూరు ప్రజలకు గుర్తుండిపోయిందని అన్నారు.

2 012 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన వస్తున్న మీకోసం తెలుగుదేశం పాదయాత్ర కార్యక్రమంలో అమరవాయి మీదుగా బూడిదపాడు వద్ద రోడ్డుపై చెప్పులు కుట్టుకునే హనుమంతు అనే వ్యక్తి వద్ద ఆగి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పులు కుట్టారని అప్పుడే ఈ ప్రసంగం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గురించి కీలకంగా మాట్లాడిన చంద్రబాబు ప్రసంగానికి నేటికీ 11 సంవత్సరాల 9 నెలల ఆరు రోజులు అయ్యిందని బక్కని నర్సింహులు గుర్తు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదట ఏబిసిడి వర్గీకరణ అమలు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. అప్పుడున్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యంతో ఏబిసిడి వర్గీకరణ అమలు సగంలోనే ఆగిపోయిందని పేర్కొన్నారు.

అయితే మందకృష్ణ మాదిగ దండోరా కార్యక్రమానికి ఆనాడే మద్దతు పలికిన చంద్రబాబు నాయుడు వర్గీకరణ సాధించే క్రమంలో తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారని మళ్లీ ఇప్పుడు కేంద్రంలో కీలక భూమిక పోషిస్తున్న చంద్రబాబు మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ అవకాశం అందించే విధంగా మరోసారి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని ఆయన కొనియాడారు.

దళితుల అభివృద్ధి కోసమే..

దళితుల అభివృద్ధి కోసమే నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు జాతి అభివృద్ధి కోసం కృషి చేశారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కలి నర్సింహులు గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా అభివృద్ధిని చేపట్టారని వివరించారు.

అన్ని వర్గాలకు ఆశ్రమ పాఠశాలలు మళ్లీ బడికి పథకం అక్షర సంక్రాంతి అక్షర కిరణం లాంటి సంక్షేమంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విద్యా విషయంలో చదువుల పండగ చట్టాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమాలు అమలుపరిచారని అన్నారు. తను తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు మెదక్ పెద్దిరెడ్డిపేట లో అంటరానితనం నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు.

దేవాలయ ప్రవేశాలు రెండు గ్లాసుల విధానాలను రూపుమాపే విధంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశారని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాదిగలకు రిడ్ క్యాప్, లెదర్ పార్కులను పెట్టామని గుర్తు చేశారు. జన్మభూమి ఇలాంటి కార్యక్రమాల్లో కూడా అంటరానితనం నిర్మూలనకు కృషి చేశామని తెలిపారు. ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ తో చేతులు కలిపి అనేక ఉద్యమాల్లో తన మద్దతు తెలియజేశారని పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టి ఉన్న నేత చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

తెలంగాణ ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టి తెలుగువారి అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా కృషిచేసి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తనకు రెండు కళ్ళని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. మొట్టమొదట నందమూరి తారకరామారావు ఆనాడు 1947 కన్నా ముందు ఉన్న 565 సంస్థానాలలో ఉన్న పటేల్ పట్వారి మాలి పటేల్ వ్యవస్థలను రూపుమాపి ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా బక్కని గుర్తు చేశారు.

LEAVE A RESPONSE