క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం,అంతులేని ఆనందమివ్వాలి

– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి
– మెర్సీ ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు

గుడివాడ, డిసెంబర్ 25: క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ ఆకాంక్షించారు. శుక్రవారం రాత్రి గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలోని మెర్సీ ప్రార్థన మందిరంలో విక్టర్ పాల్- రాణి దంపతుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ముందుగా చిన్నారులు క్రిస్మస్ గేయాలను ఆలపించారు.

అనంతరం జరిగిన సభలో దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ దైవ సేవకులు విక్టర్ పాల్ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు ఎనలేని సేవలందించి, పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బుతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తుండడం అభినందనీయమని అన్నారు. విక్టర్ పాల్ భార్య రాణి ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత25-PHOTO-2పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారని, చిన్న పిల్లలను సొంత బిడ్డల్లా ఆదరిస్తున్నారని కొనియాడారు. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. 2 వేల ఏళ్ళ కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కించేందుకు నిర్ణయించారన్నారు. ఈ లెక్కలను సులభంగా సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ 25 వ తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడన్నారు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ కు పెళ్ళి కుదిరిందని చెప్పారు.

ఒక రోజున మేరీకి దేవదూత గాబ్రియేల్ కలలో కనబడి నీవు కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారుడికి జన్మనిస్తావని, అతనికి ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడని చెప్పాడన్నారు. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చిందని, ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం
25-PHOTO-3చేసుకునేందుకు నిరాకరించడంతో అతని కలలోకి కూడా దేవదూత వచ్చి మేరీని విడిచిపెట్టొద్దని, దేవుని వరం వల్ల మేరీ గర్భవతి అయిందని, ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడని చెప్పడంతో జోసఫ్ దైవజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడన్నారు. రాజాజ్ఞననుసరించి జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమైన బెత్లహేంకు బయలుదేరారని, అక్కడ వారికి పశువుల పాకలో ఆశ్రయం దొరికిందన్నారు.

అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చిందని, ఆ సమయంలో దేవదూత వచ్చి పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడని, ఆయనే మీ అందరికీ ప్రభువని గొర్రెల కాపరులతో చెప్పడం జరిగిందన్నారు. వారంతా వచ్చి క్రీస్తును చూసి దేవదూత చెప్పిన విషయాన్ని అందరికీ తెలియజేశారన్నారు. 2 వేల సంవత్సరాల కిందట డిసెంబర్ 24 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత క్రీస్తు జన్మించాడని, ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటూ వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వెంపటి సైమన్, షేక్ బాజీ, ఎస్.కే మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply