– ఇసుకరీచ్ లను నిర్వహిస్తున్నది జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కాదు.. జగన్ రెడ్డి అతని ఇసుకమాఫియా
– రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే
• జగన్ రెడ్డి ఇసుకదోపిడీ బయటపెడుతున్న మీడియాపై..టీడీపీపై చిందులు తొక్కడం ఆపేసి, వెంకటరెడ్డి ముందు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
• జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థే రాష్ట్రంలో ఇసుకతవ్వకాలు సాగిస్తుంటే.. దాని కాలపరిమితి నిజంగా ప్రభుత్వం పొడిగిస్తే, దానికి సంబంధించిన ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదు?
• జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరుపుతుంటే.. 2023 మే నుంచి వారు ఎందుకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయడంలేదు?
• జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయకుండా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుతో వే బిల్లులు ఎందుకు ఇస్తున్నారు.. ఎలా ఇస్తున్నారు?
• రాష్ట్రంలో ఇసుకరీచ్ లను నిర్వహిస్తున్నది జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కాదు.. జగన్ రెడ్డి అతని ఇసుకమాఫియా అని స్పష్టమవుతోంది.
• టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వడం నేరమంటున్న సీఐడీకి.. కళ్లముందు విచ్చలవిడిగా సాగుతున్న జగన్ రెడ్డి అండ్ కో ఇసుక దోపిడీ కనిపించడం లేదా?
• ఇసుక దోపిడీపై తమవద్ద ఉన్నఆధారాలతో సీఐడీకి ఫిర్యాదు చేస్తాం. ఏ-1గా జగన్ రెడ్డిపై.. ఏ-2గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై.. ఏ-3గా వెంకటరెడ్డిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి వారిని విచారించే ధైర్యం సీఐడీ చీఫ్ సంజయ్ కు ఉందా?
• కేంద్రప్రభుత్వ విచారణ సంస్థలైన విజిలెన్స్..సీఐడీ..ఈడీ దర్యాప్తు జరిపితేనే జగన్ రెడ్డి ఇసుక మాఫియా గుట్టుమట్లు ప్రపంచానికి తెలుస్తాయి
• ఇసుక, మద్యం..ఇతర కుంభకోణాలతో కొల్లగొట్టే వేలకోట్లతో ఓట్లు కొని వచ్చేఎన్నికల్లో గెలవాలన్నదే జగన్ రెడ్డి పన్నాగం
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఇసుకాసురుడు జగన్ రెడ్డి ఇసుకమాఫియా సాగిస్తున్న దోపిడీపై… క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ పోరాటం చేస్తోందని, అలానే ప్రధాన ప్రసార మాధ్యమాలన్నీ కూడా పాలకుల ఇసుకదోపిడీని ఎప్పటికప్పుడు ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నాయని, మరోపక్క ముఖ్యమంత్రి కొత్త ఇసుక పాలసీ పేరుతో టెండర్ల నిబంధనలు అన్నీ మార్చేసి తమ్ముడు అనిల్ రెడ్డికి, తన బినామీలకు ఏపీలోని ఇసుక రీచ్ లు గంపగుత్తగా అప్పగించడానికి తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి ఇప్పటికీ వాస్త వాలు దాచి, ప్రజల్ని నమ్మించే ప్రయత్నంచేస్తూ, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థే ఇసుక తవ్వకాలు జరుపుతోందని దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి మీడియాపై… టీడీపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని విలేకరుల సాక్షిగా ఆధారాలతో ఖండించారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. “ ప్రభుత్వం పైకి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరు చెబుతూ, యథేచ్ఛగా జిల్లాలవారీగా జగన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న వైసీపీ ఇసుక మాఫియా డాన్ల ద్వారానే ఇసుక తవ్వకాలు సాగిస్తోంది. వాస్తవాలు బయటపెడుతున్న ప్రతిపక్షాలు.. మీడియాపై మంత్రులు.. వెంకటరెడ్డి లాంటి అధికారులు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. వెంకటరెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి, మీడియాపై మండిపడుతూ, ముఖ్యమంత్రిపై అకారణంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎగిరిపడ్డాడు. ఆయన వాదనే నిజమైతే తాము అడిగే ప్రశ్నలకు ఏం సమాధా నం చెబుతాడు?
నిజంగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారి లీజు కాలపరిమితిని జగన్ ప్రభుత్వం పొడిగించి ఉంటే, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ (అగ్రిమెంట్ కాపీలు,ఇతర వివరాలు) ఎందుకు బయటపెట్టడం లేదో సమాధానం చెప్పకుండా వెంకటరెడ్డి, మరికొందరు అధికారులు జగన్ మెప్పుకోసం మీడియాపై, టీడీపీపై నోరుపారేసుకుంటున్నారు. టెండర్ గడువు ముగిశాక మరలా కాలపరిమితి పెంచడానికి వీల్లేదు. పోనీ పెంచినట్టయితే.. దానికి సంబంధించిన సమాచారం ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
ఇవన్నీ గమనించాకే టీడీపీకి… ప్రజలకు అనుమా నాలు ఎక్కువయ్యాయి. గతంలో ప్రభుత్వం జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ఇచ్చిన ఇసుక తవ్వకాల టెండర్ గడువు మే 2023 నాటితో ముగిసినా, ఆసంస్థే ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు సాగిస్తోంది.. వారికి మరికొంతకాలం ప్రభుత్వం సమయం ఇచ్చిందని చెబుతున్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి, ప్రభుత్వ వాదనల్లో ఎంత నిజముందో పరిశీలిద్దాం..!
వెంకటరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది
ఇసుక తవ్వకాలకు సంబంధించి జగన్ రెడ్డి సర్కార్ వాదనే నిజమైతే… ఇప్పటికీ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థే ఇసుకతవ్వకాలు సాగిస్తున్నట్టయితే, ఆ సంస్థ జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఆ రిటర్న్స్ ను టీడీపీ పరిశీలిస్తే.. వాస్తవాలు బయటకు వచ్చాయి. జీఎస్టీ విభాగానికి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ సమర్పించిన వివరాలు ఇలా ఉన్నా యి. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ పేరుతో ఉన్న జీఎస్టీ నంబర్ 37AAACJ6297K1Z0. ఆ నంబర్ పై జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు, 2023-24 ఏప్రియల్ వరకు జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేశారు. తరువాత మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు.
6 నెలలపాటు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఎలాంటి జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని, రికార్డ్స్ చెబుతున్నాయి. వెంకటరెడ్డి చెప్పేదే నిజమైతే, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారికే జగన్ సర్కార్ ఇసుక తవ్వకాల కాలపరిమితి పొడిగిస్తే, రాష్ట్రంలోని అన్ని రీచ్ లలో ఇసుక తవ్వకాలు ఆ సంస్థే జరుపుతున్నట్టయితే ప్రతి నెలా జీఎస్టీ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయడంలేదో వెంకటరెడ్డి చెప్పాలి. రిటర్న్స్ ఫైల్ చేయలేదంటే.. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జయ ప్రకాశ్ పవర్ వెంచర్స్ జరపడంలేదని అర్థం. నిజంగా ఆ సంస్థే తవ్వకాలు జరిపితే.. కచ్చితంగా జీస్టీ చెల్లింపులు చేయాలి. చేయకుంటే అదో పెద్ద నేరం.
ఒక నెల రిటర్న్స్ ఫైల్ చేయలేదంటే ఏవో సమస్యలు అనుకోవచ్చు. కానీ 6 నెలలు చేయలేదంటే.. దాని అర్థం ముమ్మాటికీ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరపడంలేదనే అర్థం. ఆ సంస్థ ఎప్పుడో రాష్ట్రంలో తమ దుకాణం కట్టేసి తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోయింది అనడానికి ఇదే నిదర్శనం. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి, జగన్ రెడ్డి సర్కార్.. ఆయన మంత్రులు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం అనడానికి ఇదే పెద్ద నిదర్శనం.
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుతో జగన్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఇసుకతవ్వకాలు జరుపుతోం ది. జీఎస్టీ చెల్లింపులు చేయని జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ పేరుతో వేబిల్లులు ఎలా ఇస్తున్నారో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థే నిజంగా ఇసుక తవ్వకాలు జరుపుతుంటే.. వే బిల్లులు ఇస్తుంటే జీఎస్టీ రిటర్న్స్ కచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు.. గత 6 నెలలుగా రాష్ట్రంలోజరుగుతున్న ఇసుక తవ్వకాలకు ఎలాంటి సంబంధంలేదు. జగన్ రెడ్డి తన దోపిడీకోసం ఇప్పటికీ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ను వాడుకుంటూ, ఆ సంస్థ ముసుగులో తప్పుడు వేబిల్లులు ఇస్తూ, తన ఇసుకమాఫియా సాయంతో విచ్చలవిడిగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు.. అమ్మ కాలు సాగిస్తున్నాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధంగా దొంగ వే బిల్లులతో ఇసుక వ్యాపారం చేయడం దేశంలో మరెక్కడా చూసి ఉండరు. ఇంతకంటే పెద్ద స్కామ్ మరోటి లేదు. ఈ విధంగా అడ్డగోలుగా జరిపే దోపిడీ ఏదీ సీఐడీ విభాగానికి కనిపించదు.
టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వడం నేరమంటున్న సీఐడీకి.. కళ్లముందు విచ్చలవిడిగా సాగుతున్న జగన్ రెడ్డి అండ్ కోఇసుక దోపిడీ కనిపించడం లేదా?
టీడీపీప్రభుత్వంలో ఉచితంగా ప్రజలకు ఇసుక ఇవ్వడం మాత్రం పెద్దనేరం. మేం ప్రజల ముందు ఉంచిన ఆధారాలతో జగన్ సర్కార్ ఇసుక దోపిడీపై సీఐడీకి ఫిర్యాదు చేస్తాం. మేమిచ్చిన ఆధారాల ఆధారంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, వెంకటరెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలను విచారించే ధైర్యం ఉందా అని సీఐడీ చీఫ్ సంజయ్ ని ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక కుంభకోణంలో ఏ-1 జగన్ రెడ్డి అయితే.. ఏ-2 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏ-3 డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి. వీళ్లందరిపై కేసులు పెట్టి, వారిని విచారించే ధైర్యం సీఐడీకి ఉందా? పేదలపై భారం పడకూడదని.. ప్రజలు ఇబ్బందిపడకూడదని చంద్రబాబునాయుడు ఇసుకను ఉచితంగా అందిస్తే, అది నేరమంటున్నసీఐడీకి..కళ్లముందు విచ్చలవిడిగా సాగుతున్న జగన్ రెడ్డి అండ్ కో ఇసుకదోపిడీ కనిపించడం లేదా?
ఇంతపెద్ద కుంభకోణం కళ్లముందు కనిపిస్తుంటే, కొద్దిరోజుల క్రితం వెంకటరెడ్డి మీడియా ముందుకొచ్చి నిస్సిగ్గుగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరే చెప్పాడు. 6 నెలలుగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ జీఎస్టీ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయలేదో వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి.
ఇసుక దోపిడీద్వారా ప్రతిసంవత్సరం తాడేపల్లి ప్యాలెస్ కు రూ.10 వేలకోట్లు చేరుతున్నా యి. ఆ లెక్కన గడచిన 6 నెలల కాలంలో దాదాపు రూ.5 వేల కోట్లు చేరాయి. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుచెబుతూ.. జిల్లాల వారీగా చేస్తున్న ఇసుకదోపిడీ..మద్యం దోపిడీ.. ఇతర దోపిడీల ద్వారా వచ్చే సొమ్ముతో ఓట్లుకొని, వచ్చేఎన్నికల్లో గెలవాలన్నదే జగన్ రెడ్డి దుష్ట పన్నాగం.
కేంద్రప్రభుత్వ విచారణ సంస్థలైన విజిలెన్స్..సీఐడీ..ఈడీ దర్యాప్తు జరిపితేనే జగన్ రెడ్డి ఇసుక మాఫియా గుట్టుమట్లు ప్రపంచానికి తెలుస్తాయి
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ కాంట్రాక్ట్ కాలపరిమితిని నిజంగా పొడిగిస్తే.. జగన్ సర్కార్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎందుకు బయటపెట్టడంలేదు? జయప్రకాశ్ పవర్ వెంచర్స్ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరుపుతుంటే జీఎస్టీ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయడం లేదు? జీఎస్టీ చెల్లింపులు చేయకుండా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుతో వేబిల్లులు ఎందుకు ఇస్తున్నారు..ఎలా ఇస్తున్నారు? ఈ మూడు ప్రశ్నలకు వెంకటరెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెబితే, వారు చెప్పేది వాస్తవమేనని మేం అంగీకరిస్తాం. చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తే.. అది తప్పని చెబుతూ, ఆయనపై అక్రమంగా కేసు పెట్టిన సీఐడీ వైఖరిని ప్రజలంతా నిలదీయాలి.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకదోపిడీపై ఇప్పటికే టీడీపీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా దృష్టిపెట్టాలి. కచ్చితంగా కేంద్ర విజిలెన్స్.. సీబీఐ..ఈడీ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తేనే జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లుగా సాగించిన ఇసుకదోపిడీ గుట్టుమట్లు ప్రపంచా నికి తెలుస్తాయి. ఆయా విభాగాలన్నింటికీ కూడా తమ వద్ద ఉన్న ఆధారాలు అందించి విచారణ జరపాలని లేఖలు రాస్తాం. సీఐడీ తమ ఫిర్యాదుపై స్పందించి, నేడు రాష్ట్రం లో జరుగుతున్న ఇసుక కుంభకోణంపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకపోతే, న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే జగన్ రెడ్డి ఇసుకదోపిడీ అంతు తేలుస్తాం.” అని పట్టాభిరామ్ తేల్చి చెప్పారు .