Suryaa.co.in

Andhra Pradesh

అసలు సీఐడీ అధికారులు మమ్మల్ని విచారించనేలేదు

చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం
371 కోట్ల సామాగ్రి సరఫరా చేశాం
స్కిల్ కేసులో బాంబు పేల్చిన డీజీ టెక్ సీఈఓ ఖాన్
జీఎస్టీ స్కాం ఆరోపణలు నిజం కాదు
ఆడిటర్లను పంపితే పూర్తి లెక్కలు చూపుతాం
ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదన్న డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కొత్త ట్విస్ట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కొత్త ట్విస్ట్. ఏపీ సీఐడీ ఏ డీజీ టెక్ కంపెనీ ద్వారా కుంభకోణం జరిగిందని కేసు పెట్టిందో.. అదే కంపెనీ అధినేత, గళం విప్పారు. జీఎస్టీ స్కాం జరిగిందన్నది అబద్ధమని, సీఐడీ అధికారులు అసలు తమ వద్దకు విచారణకే రాలేదన్న బాంబు పేల్చారు. తమ వద్దకు వస్తే అన్ని లెక్కలూ చూపిస్తామని కంపెనీ సీఈఓ ఖాన్.. తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సోషల్‌మీడియాలో హల్ చేస్తోంది. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమన్న ఖాన్.. మొత్తం 371 కోట్ల రూపాయల సామాగ్రి సరఫరా చేశామని వెల్లడించారు. డీజీ టెక్ కంపెనీ సీఈఓ ఖాన్ ఏమన్నారంటే..

స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం. .ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన మొత్తం సామగ్రి సరఫరా చేశాం. సరఫరా చేసిన మొత్తం ఎక్విప్‍మెంట్‍కు సంబంధించిన డేటాను, వీడియోలో వివరించిన ఎండీ ఖాన్ విల్కర్ . పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరుకు వచ్చినా పూచీ తీసుకున్నామని, దానిపై ఒప్పందంలో ఉన్న విల్కర్.

జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు నిజం కాదు . ఏపీ దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్‍కు సంబంధించి, తమతో సంప్రదించలేదన్న డీజీ టెక్ ఎండీ ఖాన్ విల్కర్ . ఆడిటర్లను పంపితే పూర్తి లెక్కలు చూపుతామన్న విల్కర్.

LEAVE A RESPONSE