-టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పంచుమర్తి అనురాధ
2019లో ఒకతల్లి తనబిడ్డ గంజాయికి బానిసై, జీవితం నాశనంచేసుకుంటున్నాడని నాతో చెప్పుకొని వాపోయింది. ఆనాడు ఏబిడ్డ గురించైతే ఆమెచెప్పిందో, అదే అబ్బాయి సెప్టెంబర్ లో ఆత్మహత్యచేసుకున్నాడు. ఆ యువకుడి పోస్ట్ మార్టమ్ నివేదికను పోలీసులు బయటపెట్టాలి.
గుంటూరులో ఒకతల్లి తనచేతులతో తనే 17ఏళ్ల కొడుకుని చంపుకుంది.
అందుకుకారణం ఈప్రభుత్వ అసమర్థత, మాదకద్రవ్యాలను నియంత్రించలేని ఈ ముఖ్యమంత్రి ఇంకెంతమంది బిడ్డలను బలితీసుకుంటాడు? ఇంకెందరు తల్లులను నేరస్తులను చేస్తాడు?
మాదకద్రవ్యాల అంశం కొన్నిరోజులుగా రాష్ట్రంలోఎలా మార్మోగి పోతోందో, ఎవరెవరు గంజాయి వ్యాపారం చేస్తున్నారో, ఎవరు మాదకద్రవ్యాలు, ఇతరమత్తుపదార్థాలరవాణాలో ఉన్నారో వారంద రి గురించి సాక్ష్యాధారాలతో సహా, మీడియాలో కథనాలువస్తున్నా, తెలంగాణ పోలీస్ అధికారులుచెబుతున్నా, ప్రస్తుతప్రభుత్వం దాన్ని ఒప్పుకునేస్థితిలో ఎందుకులేదని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకింత బేషజాలకుపోతోందన్నఆమె, రేపటి పౌరుల భవిష్యత్ గురించి ఎందుకుఆలోచించడంలేదన్నారు?
ప్రతిపక్షం మాదకద్రవ్యాల అంశాన్ని ప్రస్తావిస్తోందని, దాన్ని అదిరిం చి, బెదిరించి అంశాన్ని పక్కదారి పట్టించాలనే లెక్కలో ప్రభుత్వం ఉంది. మాదకద్రవ్యాల అంశం ఈనాటిదికాదు.. ఏరోజైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో, ఆనాడే ఇది రాష్ట్రంలో మొదలైందన్నారు. టీడీపీ అధికారప్రతినిధిగా తానే ఈ అంశంపై 2019 నవంబర్ 12న మాట్లాడాను. (దానికి సంబంధించిన వీడియోను ఆమె ఈ సంద ర్భంగా విలేకరులకు ప్రదర్శించారు)
ఆ రోజు తాడేపల్లి పరిశీలకురాలిగా తాను ఒకసమావేశానికి హాజరయ్యాను. ఆ సమయంలో ఒకమహిళ నేరుగాతనవద్దకు వచ్చి, ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, తనపిల్లలు దానికి బానిసలై తమను వేధిస్తున్నారని నాతో చెప్పుకొని కన్నీటి పర్యంతమైం దన్నారు. ఆనాడు ఆ మహిళ మాట్లాడిన మాటలను, ఫేక్ న్యూస్ అని వైసీపీ, వారికి అనుకూలంగా ఉన్నమీడియాతో చెప్పించింది. ఆనాడు నాతో మాట్లాడిన మహిళను పోలీస్ స్టేషన్ కు పిలిపించి, ఆమెతో బలవంతంగా వారి అబ్బాయి, మాదకద్రవ్యాలవల్లకాదు, మద్యంవల్లే అలాఅయ్యాడని చెప్పించారు.
ఆఖరికి ఆమహిళ వేదనను ఫేక్ గా చిత్రీకరించి, పోలీస్ స్టేషన్లో ఆమెతో బలవంతంగా చెప్పించిందే అసలైన సమాచారమని వైసీపీ అనుకూలమీడియా ప్రచారం చేసింది. అదిజరిగిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి ఇంటిపక్కల కార్బన్ సెర్చ్ పేరుతో సోదాలు జరిగాయి. అదిజరిగిన తరువాత నవంబర్ 14, 15, 16, 17 తేదీల్లో తాడేపల్లిలో మాదకద్రవ్యాలు దొరికాయని పోలీసులే చెప్పారు. (దానికి సంబంధించిన పత్రికల క్లిప్పింగ్స్ ను అనురాధగారు విలేకరులకు ప్రదర్శించారు.) విజయవాడే స్మగ్లింగ్ అడ్డా అని, నైజీరియా టూ బెజవాడ అని, గంజాయితో పట్టుబడిన న్యాయవాది అని, చదువుచాటు గంజా యి అని పత్రికల్లో పతాకశీర్షికల్లో వార్తలు వచ్చాయి.ఆనాడు అంత స్పష్టంగా ఆ మహిళ తనతోచెప్పిన మాటలను ఈ వైసీపీ అబద్ధమ ని నమ్మించడానికిప్రయత్నించింది. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, బలవంతంగాతాను చెప్పింది అంతాఅబద్దమని వైసీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేసింది.
ఆ కథ 2019లో జరిగితే, ఈ ఏడాది పోయిననెలలో ఏంజరిగిందో కూడా అందరికీ తెలియాలి. ఆనాడు నాతోమాట్లాడి, తనబిడ్డలు గంజాయికి బానిసలయ్యారని చెప్పిన ఆమె రెండో అబ్బాయి మణికంఠ, సెప్టెంబర్ 18న ఆత్మహత్య చేసుకున్నాడు. 2019లో ఏ అబ్బాయి మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని తల్లి బాధపడిందో, 2021 సెప్టెంబర్ నాటికి, ఆ తల్లికొడుకే, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అబ్బాయి దేనికి ఆత్మహత్యచేసుకున్నాడో పోలీసులు పోస్ట్ మార్టమ్ నివేదికను బయటపెట్టాలి. అతను మాదకద్రవ్యాలకు బానిసై చనిపోయాడా..లేక మరేకారణంతోనా అన్నది ప్రజలకుతెలియాలి. ఆరోజు మేంహెచ్చరించినప్పుడే పోలీసులు మాదకద్రవ్యాలను నిరోధించి ఉంటే, ఇలాంటి ఎందరో యువకులు జీవితాలు బలిచేసుకునేవారు కాదుకదా? జగన్మోహన్ రెడ్డికి పిల్లలున్నారు…నాకూ పిల్లలున్నారు.. అలాంటి పిల్లలకోసం తల్లిదండ్రులు ఎన్నోత్యాగాలుచేసి, తీర్చిదిద్దాల నుకుంటారు. అలాంటి పిల్లలజీవితాలు నాశనంకాకూడదని నిజంగా ఈ ముఖ్యమంత్రికి ఉంటే, ఆయన ఈ వ్యవహారంపై స్పందిస్తారు…స్పందించాలి.
మాతో ఆ తల్లిచెప్పుకున్న బాధను ఫేక్ వీడియో అని నానాయాగీచేయించారు. మీకు అనుకూలమైన సోషల్ మీడియాతో టీడీపీపై నిందలేయించారు. కానీ ఇప్పుడుజరిగిన దానికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీమంత్రులుఏం సమాధానం చెబుతారు? ఒకతల్లి తనవేదన చెప్పుకున్నప్పుడే ఈ ప్రభుత్వం స్పందించిఉంటే, రెండేళ్లతర్వాత ఆమెబిడ్డ బలయ్యేవాడు కాదుగా? టైమ్స్ ఆఫ్ ఇండియాపత్రికలో ఫిబ్రవరి 8, 2021న గుంటూరు పట్టణంలో 43ఏళ్లతల్లి తన 17ఏళ్ల కొడుకుని దారుణంగా చంపేసిందనే వార్తవచ్చింది. కారణం ఆ కొడుకు మాదకద్రవ్యాలకు బానిసై, తనను వేధించడమే. తనపిల్లాడిని తానే చంపుకునేలా చేయడమేనా ఈ ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడి.? అమ్మఒడి పేరుతో ఈప్రభుత్వం అమ్మలను నేరస్తులనుచేస్తోంది. మాదకద్రవ్యాలకు బానిసలైన తమబిడ్డలను ఇంట్లోనిలువరించలేక, వారి వేధింపులుపడలేక, వారుపడుతున్న బాధనుచూడలేక తల్లులే వారిని చంపేస్తున్నారు. మనిషి ప్రాణం విలువ ఈ ప్రభుత్వానికి తెలుసా? తెలిస్తే, మాదకద్రవ్యాల గురించి మాట్లాడిన మాపార్టీ నేతలపై గయ్యి…గయ్యి అని పడిపోతారా?
చేతిలో సొంతపేపర్ ఉందికదా అని ఏదిపడితే అది రాసేస్తారు. టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేశ్ గారు మొన్ననేచెప్పారు.. ఈ మాదకద్రవ్యాలు ఎక్కడినుంచి ఎక్కడికి వస్తున్నాయో. రాష్ట్రం కేంద్రంగా దేశవ్యాప్తంగా, ఆతరువాత దేశాలు దాటి ఎలా రవాణా అవుతున్నాయో, ఎవరువాటివెనకున్నారో స్పష్టంగా చెప్పారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఇలాంటి దుస్థితికి ఎవరుకారణం… ఈప్రభుత్వంకాదా? ఈరోజు కూడా ఏసీబోగీల్లో గంజాయి రవాణా అవుతోందని పత్రికల్లోవచ్చింది. ఈ విధంగా రాష్ట్రంలో నిత్యం మాదకద్రవ్యాలు, గంజాయికి సంబంధించిన కథనాలు, వార్తలు బయటకువస్తున్నా, ప్రభుత్వం ఏమీలేదనే అంటుందా? ముఖ్యమంత్రి, ప్రభుత్వపెద్దలు, మంత్రుల పిల్లలేమో బాగా చదివి విదేశాల్లోస్థిరపడాలా… సామాన్యప్రజలు వారి బిడ్డలు మాత్రం గంజాయికి బలికావాలా? ఇదేమీ న్యాయం?
మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నన్ను ఆమాటన్నారు..ఈ మాటన్నారు అనే మీరుమీఇంటిపక్కల జరిగిన స్టోరీపై ఏంచర్యలు తీసుకుంటారు? ఏతల్లి అయితే ఆనాడు, తనవేదన నాతో చెప్పుకుందో, ఆమెను ఇప్పటికిప్పుడే పోలీసులు వెళ్లి భయపెడతారు. పోలీసులే నక్సలైట్ల మాదిరి బాధితకుటుంబాలపై పడుతుంటే, వారుభయంతో చేసేదిలేక, సామాన్లు సర్దుకొని పారిపోతున్నారు. ఈ రాష్ట్రంలోని ప్రజలుఎంతటి దయనీయస్థితి లో బతుకుతున్నారో ఈ ముఖ్యమంత్రికితెలుసా. ఒక మహిళ తనతో చెప్పుకున్న బాధను ఫేక్ న్యూస్ అని ఇలాప్రచారం చేశారంటని రెండేళ్లనుంచి నేను బాధపడుతూనే ఉన్నాను.
అది అలా ఉంటే, పోయిననెలలో ఆమె బిడ్డ చనిపోయాడని తెలిశాక నా మనసు మనసులోలేదు. సదరు యువకుడి మరణవార్త తెలిశాక, చంద్రబాబునాయుడు సహా, మాపార్టీ వారందరం చాలా బాధపడ్డాము. ఈ విధంగా ఇంకా ఎంతమంది యువకులు తమప్రాణాలుకోల్పోవాలి? ఈప్రభుత్వానికి మంచి చెబితే ఎక్కడం లేదు.. పైగా దాడులుచేస్తున్నారు. మాదద్రవ్యాలకు బానిసలై నవారు కళ్లముందే బలవన్మరణాలకు పాల్పడుతుంటే, ఇంత కంటే ఈ ప్రభుత్వానికి, చెత్తమనుషులకు ఏం సాక్ష్యాలు కావాలి?