Suryaa.co.in

Andhra Pradesh

బీసీలపై సీఎం చంద్రబాబు వరాల జల్లు

• ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.254.48 కోట్లు
• బీసీ హాస్టల్ విద్యార్థులకు రూ.155.32 కోట్ల అదనపు చెల్లింపు
• డైట్ బిల్లులకు రూ.45.52 కోట్లు
• కాస్మోటిక్ ఛార్జీల కింద రూ.21.60 కోట్లు
• అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు
• 104 హాస్టళ్లలో ఎస్సార్ శంకరన్ రిసోర్సు సెంటర్ల ఏర్పాటు
• అసంపూర్తిగా నిలిచిన 5 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.85 కోట్లు
• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖమంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమీక్షాసమావేశం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రి సవిత, ఆ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన నిధులు, ఈ 6 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడు అంశాల వారీగా సమీక్షించారన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థుల డైట్ బిల్లుల కోసం బడ్జెట్ లో కంటే అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు.

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో డైట్ ఛార్జీలకు రూ.135 కోట్లు చెల్లించారని, ఇప్పుడు అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాస్మోటిక్ ఛార్జీలకు బడ్జెట్ లో రూ.11 కోట్లు కేటాయించగా, అదనంగా రూ.21.60 కోట్లు మంజూరుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని మంత్రి సవిత తెలిపారు. ట్యూటర్ల పారితోషకానికి బడ్జెట్ లో కోటి రూపాయలు కేటాయించగా, ఇప్పుడు రూ.3.20 కోట్లు అదనంగా చెల్లించడానికి ఆదేశించారన్నారు.

గతంలో నిర్మాణం ప్రారంభించి 80 శాతం పనులతో అసంపూర్తిగా నిలిచిపోయిన 5 బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణానికి తక్షణమే రూ.85 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. ఇలా గత బడ్జెట్ కంటే అదనంగా 155.32 కోట్లు చెల్లిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రితెలిపారు.

బీసీ స్టడీ సర్కిల్ కు అమరావతిలో 5 ఎకరాలు

బీసీ అభ్యర్థుల కోసం ఇటీవల విజయవాడలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ప్రారంభమైన నేపథ్యంలో…రాజధాని ప్రాంతం అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ కు శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందిని మంత్రి తెలిపారు. ఈ భవనం కోసం అమరావతిలో 5 ఎకరాలు కేటాయింపునకు ప్రతిపాదనలు పరిశీలిస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారన్నారు. విజయవాడలో ప్రారంభించిన సివిల్స్ కోచింగ్ సెంటర్ ను పకడ్బందీగా నడపాలని, ఉత్తమ ఫలితాలు రాబట్టాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు.

ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.254.48 చెల్లింపు

కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పుల కోసం రూ.254.48 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.31.51 కోట్లు, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పులకు రూ.222.97 కోట్లను కేంద్ర, రాష్ట ప్రభుత్వ వాటాలుగా సింగిల్ నోడల్ అకౌంట్ కు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారన్నారు.
ఎస్సార్ శంకరన్ రిసోర్సు సెంటర్ల ఏర్పాటు

రాష్ట్రంలో తొలి విడతగా 104 బీసీ హాస్టళ్లలో ఎస్సార్ శంకరన్ రిసోర్సు సెంటర్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపారని మంత్రి తెలిపారు. ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచడంతో పాటు విషయ పరిజ్ఞానం పెంపుదలకు ఈ రిసోర్సు సెంటర్లు ఎంతో ఉపయోగపడనున్నాయన్నారు. ఈ నెలాఖరులోగా ఎస్సార్ శంకరన్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.

5 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.85 కోట్లు

రాష్ట్రంలో అసంపూర్తిగా 80 శాతం పనులతో నిలిచిపోయిన అయిదు బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు తక్షణమే రూ.85 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారనిమంత్రితెలిపారు.. తక్షణమే నిర్మాణాలు పూర్తి చేసి, వాటిని వినియోగంలోకి తీసుకోవాలని స్సష్టంచేశారన్నారు.

మరిన్ని అంశాలు :

• 2014-19 మధ్య ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.45.54 కోట్ల బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
• నిర్మాణంలో ఉన్న మూడు బీసీ భవనాలను పూర్తిచేయడానికి రూ.10.12 కోట్లు విడుదల చేశామని, తక్షణమే ఆ భవనాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకోవాని ఆదేశించారు.
• ఇప్పటికే రూ.18 కోట్లు కేటాయించిన వసతి గృహాల్లో వంట సామాగ్రి, ఇతర వస్తువుల కొనుగోలు చేయాలి.
• జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ కులాల కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి గల అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం.
• విడుదల చేసిన రూ.13.10 కోట్లతో వెంటనే వసతి గృహాల మరమ్మతులు చేపట్టాలి.
• బీసీ రక్షణ చట్టం, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యసాధ్యాల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటుకు ఆదేశించిన సీఎం చంద్రబాబు .
• బీసీ యువతను, మహిళలను ఎంఎస్ఎంఈ ద్వారా పారిశ్రామిక వేత్తలుగా రూపొదించడానికి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఆర్థిక చేయూత ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
• కాపు భవనాలను పూర్తి చేయడానికి రూ.5.41 కోట్లు విడుదలకు అంగీకరించిన సీఎం చంద్రబాబు
• ఈడబ్ల్యూఎస్ లో ఉన్న బీపీఎల్ కుటుంబాలను అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్న సీఎం చంద్రబాబు
• ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ మాదిరిగా ఇతర ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేసి వ్యక్తిగత, గ్రూపు రుణాలు అందించాలి.
• గుంటూరులోని బ్రాహ్మణ కార్పొరేషన్ కు చెందిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్రాహ్మణుల అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రిసవిత తెలిపారు.

LEAVE A RESPONSE