Suryaa.co.in

Telangana

రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన తొలి సంతకం

సీఎం కప్ నిర్వహణ కు 3 కోట్ల 20 లక్షల రూపాయలను మంజూరు చేసిన మంత్రి
తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా తొలి సంతకాన్ని చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ 

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా 4వ అంతస్తు లో నూతన చాంబర్లో రాష్ట్రంలో సీఎం కప్పు క్రీడల పోటీల నిర్వహణపై తొలి సంతకం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేయడానికి రాష్ట్రవ్యాప్తంగా చీఫ్ మినిస్టర్స్ కప్ ను నిర్వహించాలని అందుకు సంబంధించి 3 కోట్ల 20 లక్షల రూపాయలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల హబ్ గా రూపుదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు.

LEAVE A RESPONSE