– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ – హనుమకొండ – హంటర్ రోడ్డు – శాయంపేట సర్కిల్ లో గల ఆమె విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారంటే..తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి(చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి.తెలంగాణ వీర వనిత, ధైర్య శాలి చాకలి(చిట్యాల) ఐలమ్మ.అనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖులను ఎదుర్కొన్నది.చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి లను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు.
నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ.రాయపర్తి మండలం కిష్ట పురం లో 1895, సెప్టెంబర్ 26న పుట్టింది.పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య తో పెండ్లి జరిగింది.5 గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు.కుల వృత్తి జీవన ఆధారంగా బతికింది.మల్లంపల్లి కొండల రావు కు చెందిన పాలకుర్తిలో ని భూమిని కౌలు కి తీసుకొంది. నాలుగు ఎకరాలు పండించింది.
ఆ సమయంలో స్థానిక పట్వారీ పొలంలో పనికి రాని ఐలమ్మ పై కమ్యూనిస్టుల లో చేరిందని ఆయన దేశ్ ముఖ్ కి ఫిర్యాదు చేశాడు.ఐలమ్మ సాగు చేసిన పొలాన్ని తన పేరున రాయించుకొని ఆ పొలం తనదేనని, ఆ పంట కూడా తనదేనని తన మనుషులను పంపించాడు.సంఘం సహాయంతో వాళ్ళని తిప్పి పంపిన ఐలమ్మ, కోర్టు లో కేసు వేసి, అనాడు పేరు మోసిన లాయర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారం తో గెలిచింది.
నాడు సంఘం గా పిలిచే, కమ్యూనిస్టుల తో చేయి కలిపి తన పొలాన్ని దేశ్ ముఖ్ గుండాల నుండి కాపాడుకుంది.వారు చేసిన ఆనాటి ఉద్యమమే, తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయింది. ఆ తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యింది.చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ ఆనాటి దేశ్ ముఖులు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించింది. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మ లాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలు. ఐలమ్మ తన 90వ ఏట, 1985 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో మరణించారు.ఐలమ్మ స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారు.
అదే స్ఫూర్తి ని సీఎం కెసిఆర్ కొనసాగిస్తున్నారు.పరిపాలన లో ఉద్యమ స్ఫూర్తిని పాటిస్తున్నారు.అందుకే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా మారింది.ఐలమ్మ జయంతి, వర్ధంతి లను అధికారికంగా నిర్వహిస్తుండటం పట్ల సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు!మరోసారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన0గా పుష్పాంజలి ఘటిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.